సినిమా రచయిత గా కోన వెంకట్ కు ఇండస్ట్రీ వర్గాలలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.  రచయితగా నిర్మాతగా దర్శకుడిగా ఇలా విభిన్నపాత్రలు నిర్వహిస్తున్న కోన వెంకట్ కు ఇండస్ట్రీ వర్గాలలో  అందరివాడు అనే పేరు ఉంది. పవన్ నుంచి ఇటు నాని వరకు అందరి హీరోలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించే ఈ రచయితకుఎప్పటికైనా పవన్ కళ్యాణ్ తో సినిమాను తీయడం జీవిత ధ్యేయం.
KONA VENKAT LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ప్రస్తుతం రచయితగా ఇతడు  కధలు అందించిన చాలసినిమాలు ఈమధ్య పరాజయం సాధించడంతో కోన వెంకట్ తన పరిచయాలను వాడుకుంటూ తన కోన ఫిలిమ్ కార్పొరేషన్ పై  సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ఈ విలక్షణ రచయితకు ఒక యంగ్  హీరోతో సమస్య వచ్చింది అన్న గాసిప్పులు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్నాయి. 
NAGA SHOURYA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
తెలుస్తున సమాచారం మేరకు  ఏడాది క్రితం నాగశౌర్యతో ఒక ప్రాజెక్టు సెట్ చేసాడు కోన వెంకట్ అని టాక్. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇరవై లక్షలు అడ్వాన్స్ గా నాగ శౌర్యకు ఇచ్చినట్లు సమాచారం   అయితే అదే సమయంలో నాగశౌర్య ఫ్యామిలీ తమ సొంత సినిమా ‘ఛలో’ సినిమా మొదలు పెట్టడంతో కోన వెంకట్ సినిమా వెనక్కు వెళ్లినట్లు తెలుస్తోంది. ‘ఛలో’ సినిమా హిట్ కావడంతో ఇప్పుడు నాగశౌర్య మరో సొంత ప్రాజెక్టు ‘నర్తనశాల’ స్టార్ట్ చేస్తున్నాడు. 
KONA VENKAT LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
కోన వెంకట్ సెట్ చేసిన ప్రాజెక్టును ఏదో ఒక నెపంతో వెనక్కు నెట్టడం ఈరచయితకు విరీతమైన అసహనాన్ని కలిగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఈమూవీ పై ఏడాదిపాటు బోలెడు ఖర్చుచేసామని ఇరవై లక్షలు అడ్వాన్స్ ఇచ్చామని ఇప్పుడు తామేంచేయాలని అంటూ కోనవెంకట్ రగిలిపోతునట్లు వార్తలు వస్తున్నాయి. అయితే నాగ శౌర్య మాత్రం తనకు కోనవెంకట్ చెప్పిన కధకు ఫైనల్ స్క్రిప్ట్ కు చాలా తేడాలు వచ్చాయని అందుకే తాను ఈమూవీ ప్రాజెక్ట్ పై వెనకడుగు వేసాను అని చెప్తున్నట్లు టాక్. దీనితో కోన వెంకట్ ఈవిషయం పై  ప్రొడ్యూసర్ కౌన్సిల్ ను అప్రోచ్ అయ్యే ఆలోచనలు చేస్తున్న ట్లు గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. ఈవార్తలలో ఎన్నినిజాలో తెలియకపోయినా హడావిడి హేస్తున్న ఈవార్తలు  నాగ శౌర్య కెరియర్ కు మంచిదికాదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: