ప్రియా ప్రకాశ్ వారియర్.. ఈ కుర్రభామ ఒకే ఒక్క వీడియోతో రాత్రికి రాత్రే స్టార్‌ అయిపోయింది. ఇలా ఒక్కసారి కన్నుకొట్టి ఇంతగా ఫేమస్ అయినవారు గతంలో లేరేమో.. ఆమె నటించిన తొలి చిత్రం 'ఒరు అదార్‌ లవ్‌' టీజర్‌ ఎంత ఫేమస్ అయ్యిందో తెలిసిందే. దేశవ్యాప్తంగా స్టార్ అయ్యింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. 

Image result for priya prakash varrier
అంతేనా.. సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. తొలి సినిమా విడుదల కాకముందే.. తెలుగు, తమిళం, హిందీ నుంచి సినిమా అవకాశాలొస్తున్నాయట. ఇందులో విచిత్రం ఏముంది. ఫేమ్ ఉన్నచోటే కదా సక్సస్ కు ఛాన్స్ ఉంటుంది. ఇంతవరకూ కామన్.. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ప్రియా ప్రకాశ్ క్రేజ్ ను మరో రకంగా వాడుకోవాలని చూస్తున్నాయి కొన్ని కంపెనీలు.  

Image result for priya prakash varrier
కంపెనీలు అంటే సాధారణంగా యాడ్ లో నటించమని అడుగుతుంటాయి. మరొకొన్ని బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమంటాయి. కానీ ఇప్పుడు సరికొత్తగా తమ ఉత్పత్తులను ప్రచారం చేసి పెట్టాలని పలు కంపెనీలు ఆమెను సంప్రదిస్తున్నాయట. తన ఇన్‌స్టాగ్రామ్‌ తదితర సోషల్‌ మీడియా అకౌంట్స్‌లో తమ ఉత్పత్తి గురించి ఓ పోస్టు పెడితే దానికి భారీ స్థాయిలో రెమ్యునేషన్‌ చెల్లిస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నాయట. 

Image result for priya prakash varrier
ప్రియా ప్రకాశ్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో తమ ఉత్పత్తి గురించి ఓ పోస్టు చేస్తే రూ.8 లక్షల దాకా ఇస్తామంటూ పలు సంస్థలు ఆఫర్‌ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఫస్ట్ మూవీ రిలీజ్ కాకుండానే ప్రియా ప్రకాశ్‌కు ఈ స్థాయిలో వస్తున్న అవకాశాలపై సినీ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయట. ఏదేమైనా ఇప్పుడు ప్రియా టైమ్ నడుస్తోందన్నమాట. 



మరింత సమాచారం తెలుసుకోండి: