యంగ్ హీరో నిఖిల్ నటించిన ‘కిరాక్ పార్టీ’ మూవీ ఈవారం విడుడుదల కాబోతోంది. మన తెలుగురాష్ట్రాలలో ధియేటర్లు బంద్ ముగిసిన తరువాత తిరిగి తెరుచుకున్న తరువాత విడుదల కాబోతున్న ఈమూవీ పై భారీ ఆసలు పెట్టుకున్నాడు నిఖిల్. దీనితో ఈమూవీని భారీగా ప్రమోట్ చేస్తూ   ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఎన్ని ప్రయత్నాలుచేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు నిఖిల్. కాలేజీ వాతావరణం యూత్ మసాలాలు అన్నీ ఉన్న ఈమూవీ గన్ షాట్ హిట్ అన్న టాక్ వినిపిస్తోంది. 
HERO NIKHIL IN KIRAK PARTY MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈనేపధ్యంలో ఒకప్రముఖ ఛానల్ లో ఈసినిమాను ప్రమోట్ చేస్తూ 'సూప్ గేమ్' అనే వెరైటీ షోను నిర్వహించారు. ఈకార్యక్రమంలో హీరో నిఖిల్ హీరోయిన్లు సిమ్రన్ పరింజ్దా సంయుక్తా హెగ్డేలు పాల్గొన్నారు. ఈషో నిర్వహిస్తున్న పద్ధతి ప్రకారం ఈషోలో పాల్గొంటున్న ఈముగ్గుర్ని  ఒకే ప్రశ్న అడుగుతారు. తప్పు సమాధానం చెబితే రసగుల్లా కాఫీ కలిపిన విచిత్రమైన సూప్ తాగాల్సి ఉంటుంది. అయితే ఈకార్యక్రమాన్ని మరింత రక్తి కట్టించాలని ఈకార్యక్రమం నిర్వహిస్తున్న యాంకర్ ఈహీరొయిన్లను ఒక విచిత్ర ప్రశ్న అడిగి ఇరుకున పెట్టడానికి ప్రయత్నించింది.
NIKHIL IN KIRAK PARTY PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇంతకీ ఆప్రశ్న ఏమిటంటే ‘హీరో నిఖిల్ దర్శకుడు శరన్ కొప్పిశెట్టి నిర్మాత అనిల్ సుంకరలలో ఒకరిని చంపి ఒకరిని పెళ్లి చేసుకుని మరొకరితో హుక్ అప్ చేసుకోవాల్సి వస్తే ఎం చేస్తారు ?’ అని ఆ కార్యక్రమ యాంకర్ అడిగింది. దీనికి ముందుగా సిమ్రన్ చెప్పిన సమాధానం ముందుగా పెళ్ళైన అనిల్ సుంకరను చంపేసి నిఖిల్ తో హుక్ అప్ చేసుకుని లాస్ట్ లో శరన్ కొప్పిశెట్టితో పెళ్లి చేసుకుని సెటిల్ అవుతుందట. హుక్ అప్ అంటే ఒక్క రాత్రి గడపటం అని అర్ధం. అయితే ఇదేసినిమాలో మరో హీరోయిన్ పాత్రపోషిస్తున్న సంయుక్త మాత్రం రివర్స్ ఆన్సర్ ఇచ్చింది. నిఖిల్ ని చంపేసి అవకాశాల కోసం శరన్ కొట్టి శెట్టి తో హుక్ అప్ చేసుకుని ధనవంతుడు నిర్మాత కాబట్టి అనిల్ సుంకరను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. 
NIKHIL IN KIRAK PARTY PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనితో ఆకార్యక్రమం నిర్వహిస్తున్న యాంకర్ మైండ్ బ్లాంక్ అయిపోయి తాను ఇంటర్వ్యూ చేస్తోంది హీరోయిన్స్ తోనా లేక క్రిమినల్ మైండ్ తో ఉన్న వ్యక్తులతోనా అన్న జోక్ చేసింది. అయితే ఈకార్యక్రమంలో పాల్గొన్న ఏ హీరోయిన్ కూడ నిఖిల్ తో ఫైనల్ గా సెటిల్ అవుతాము అని చెప్పకపోవడం ఇక్కడి ట్విస్ట్. అందుకే కాబోలు ఈమధ్య నిఖిల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భార్యను ఎంచుకోవడం సినిమా కథను ఎంచుకోవడంకన్నా కష్టంగా మారిపోయింది అంటూ సెటైర్లు వేసాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: