లెక్క‌ల మాస్టారు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన క్రేజీ ప్రాజెక్ట్ రంగ‌స్థ‌లం. రామ్ చ‌ర‌ణ్‌, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన ఈ చిత్రం మార్చి 30న విడుద‌ల కానుంది. ఇప్ప‌టి వ‌ర‌కు చిత్రానికి సంబంధించిన విడుద‌లైన పోస్ట‌ర్స్‌, టీజ‌ర్‌, సాంగ్స్ ఫ్యాన్స్‌లో చిత్రంపై చాలా ఆస‌క్తి క‌లిగించాయి. సినిమా ఎప్పుడెప్పుడు విడుద‌లవుతుందా, ఎప్పుడెప్పుడు చూసేద్ధామా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.   
Image result for rangasthalam stills
సుకుమార్ లాంటి డైరక్టర్ తొలిసారి ఫుల్ లెన్గ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ సినిమా చేయడం. అది కూడా 1985నాటి పీరియాడిక్ ఫిల్మ్ కావడం. రామ్ చరణ్, సమంత విభిన్నంగా కనిపించడం. పాటలు సూపర్ గా వుండడం. ఇలా అన్ని విధాలుగా  సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. ఇక ఈ నెల 18వ తేదీన వైజాగ్‌లోని ఆర్కే బీచ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఏర్పాటు చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఈ స్టేజ్‌పై దేవి శ్రీ ప్రసాద్ లైవ్ ప‌ర్‌ఫార్మెన్స్ ఓ ఎట్రాక్ష‌న్ అయితే క‌ళాకారులు బుర్ర క‌థ‌, త‌ప్పెట‌లు, చోడ‌వ‌రం డ‌ప్పుల‌తో వాద్యాల‌ను ప్ర‌ద‌ర్శించ‌నుండ‌డం మ‌రో స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ అవుతుంద‌ని చెప్పుకొస్తున్నారు.
Image result for rangasthalam stills
1985 కాలం నాటి గ్రామీణ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా ప్ర‌తి ఒక్క‌రిని అల‌రించేలా ఉంటుంద‌ని టాక్‌. ఇప్పుడు రంగస్థలం సినిమాకు సంబంధించిన ఒక్కో పోస్టర్ రిలీజ్ చేయాలని చూస్తున్నారట చిత్ర యూనిట్.
Related image
రంగస్థలం సినిమాలో గ్రామీణ రాజకీయాలు కూడా వుంటాయని, హీరో రామ్ చరణ్ సోదరుడిగా నటించే ఆది పినిశెట్టికి కీలకపాత్ర వుందని, గ్రామీణ రాజకీయాలకు ఆ పాత్ర బలమవుతుందని గ్యాసిప్ లు వున్నాయి. ఇప్పుడు ఈ గ్యాసిప్ లకు బలం చేకూర్చే పోస్టర్ ఒకటి సోషల్ నెట్ వర్క్ లోకి వచ్చింది.
rangasthalam movie still
ఆ పోస్టర్ లో ఆది పినిశెట్టి ఫోటో భలేగా వుంది. 1985నాటి హెయిర్ స్టయిల్. కళ్లజోడు. పేరుకే (కొణిదెల అనుకోవాలనేమో) కుమార్ బాబు. లాంతరు గుర్తుపై ప్రెసిడెంట్ పదవికి పోటీ పడుతున్నట్లు ఆ పోస్టర్ లో వుంది. రంగస్థలం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రెసిడెంట్ పదవికి లాంతరు గుర్తుపై పోటీ చేస్తున్న కుమార్ బాబుకు ఓటేయమని విజ్ఞప్తి వుంది. ఈ పోస్టర్ చూస్తుంటే నిజంతా సినిమా పై విపరీతమైన అంచనాలు పెరిగిపోతున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: