నిన్న పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా మంగళగిరి దగ్గర కాజా సమీపంలో తన సొంత ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసి ఒకరోజు గడవకుండానే పవన్ కొత్త ఇంటి నిర్మాణం పై మీడియాలో వస్తున్న సెటైర్లను చూసి చాలామంది ఆశ్చర్య పోతున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు పవన్ నిర్మాణం చేపట్టిన రెండెకరాల స్థలం విలువ 30 కోట్లు ఉంటుందని అంటున్నారు.
మిగతా ఫ్లోర్‌లలో ఇలా
దీనికితోడు అత్యంత భారీ స్థాయిలో నిర్మాణం జరుపుకోబోతున్న ఈ భావన నిర్మాణం ఖర్చు కనీసం 40 కోట్లు ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. పవన్ చాల సార్లు తన దగ్గర పనిచేసేవారికి జీతాలు కూడ ఇవ్వలేని పరిస్థుతులలో ఉన్నానని చెప్పిన సందర్భాలు ఉన్న నేపధ్యంలో హఠాత్ గా పవన్ కు 70 కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయి అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
సౌకర్యాలపై పవన్ కళ్యాణ్ ఆరా
ఇది ఇలా ఉండగా మూడంతస్తులలో నిర్మాణం జరుపుకోబోతున్న ఈ ఇంటికి 8 అడుగుల గోడ దానిపై ఇనుప కంచె రక్షణగా ఉండే విధంగా ప్లాన్ చేసారు అని తెలుస్తోంది. ఈ భవనంలో 60 శాతం స్థలాన్ని పార్కింగ్, గార్డెనింగ్ కోసం విడిచి పెట్టనున్నారని సమాచారం. మొత్తం మూడు అంతస్తుల్లో ఉండే ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్‌లో సమావేశపు మందిరంతో పాటు అతిథులు ఎవరైనా వస్తే బస చేసేందుకు గదులు శాశ్వత పని వారి కోసం నివాసం గదులు ఉంటాయని తెలుస్తోంది. 
వీడియోలో 49 మంది మహనీయుల చిత్రాలు
మరొక ఫ్లోర్‌ లో మరో చిన్న సమావేశపు మందిరంతో పాటు వంటగది, డైనింగ్ హాల్, బెడ్రూంలు తదితరాలు ఉండనున్నాయని తెలుస్తోంది. బయటకు వస్తున్న ఈ లీకులను బట్టి పవన్ అత్యంత భారీ స్థాయిలో తన సొంత ఇల్లు కలను నిజం చేసుకుంటున్నాడు. తన ‘జనసేన’ తో తెలుగు రాష్ట్రాలలోని ప్రజలందరికీ దగ్గర అవ్వాలి అని పవన్ ప్రయత్నాలు చేస్తున్న నేపధ్యంలో భాగ్యనగరంలో ఇప్పటికే ఫామ్ హౌస్ ఏర్పరుచుకున్న పవన్ ఇప్పుడు అమరావతి దగ్గర మరో పెద్ద ఇల్లును కట్టుకుంటూ ఇరు రాష్ట్రాలలోని తెలుగు ప్రజలు తనకు రెండు కళ్ళతో సమానం అంటూ తన రెండు పడవల సిద్దాంతాన్ని కొనసాగిస్తున్నాడనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: