ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.  దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న చందంగా హీరోలు మంచి ఫామ్ లో ఉండగానే తమ తనయులను హీరోలుగా చేస్తూ వారి మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు. ఇదే బాటలో నడుస్తున్నాడు చియాన్ విక్రమ్. తెలుగు ఇండస్ట్రీలో సందీప్ వంగా  దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. 
Dhruv Bearded Look From Arjun Reddy Tamil Remake - Sakshi
ఈ సినిమా  చూసి ఇంప్రెస్ అయి  బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా తీయడానికి సిద్దం అయ్యారు.  ఈ నేపథ్యంలో తమిళ హీరో  విక్రమ్‌ తనయుడు ధృవ్‌ హీరోగా అర్జున్ రెడ్డి సినిమా ‘శర్మ’గా  తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాను విలక్షణ దర్శకుడు బాలా డైరెక్ట్ చేస్తుండటంతో సినిమా మీద మరింత ఆసక్తి నెలకొంది.   కథలోని క్యారెక్టర్‌కు తగ్గ లుక్‌ కోసం ధృవ్‌ ఆరు నెలలుగా కష్టపడుతున్నాడు. తాజాగా సినిమాకు తగ్గ మేకోవర్‌తో రెడీ అయిన ధృవ్‌ లుక్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌ చేస్తోంది.

బాగా పెరిగిన గెడ్డం, మీసంతో ధృవ్ రఫ్‌ లుక్‌లో అదరగొడుతున్నాడు. ఇప్పుడు హీరోయిన్‌ను వెతికే పనిలో పడిన యూనిట్ సభ్యులు సీనియర్ నటి గౌతమి కూతురు సుబ్బులక్ష్మి పేరును పరీశీలిస్తున్నట్లుగా సమాచారం. ఈ4 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ బ్యానర్‌లో రాబోతున్న ఈ సినిమాపై కోలీవుడ్‌లో ఓ వైపు భారీ అంచనాలున్నాయి. తెలుగులో గ్రాండ్ సక్సెస్ కావటం, అగ్ర హీరో విక్రమ్ తనయుడు హీరోగా కనిపించనుండటం తమిళ తంబీల్లో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. 
Image result for విక్రమ్ తనయుడు ధృవ్
ఈ సినిమా కోసం నీహారిక…కార్తీక…శ్రుతి హాసన్… అలియా భట్ అందరినీ పరిశీలించిన తర్వాత తెలుగు నటి గౌతమి కూతురు సుబ్బులక్ష్మి తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.   కమల్ హాసన్ తో సహజీవనం చేయడం జరిగిపోయింది. ఇప్పుడు కమల్ తో కూడా బంధాన్ని తెంపుకుంది గౌతమి. దానికి శ్రుతిహాసనే కారణమన్న వదంతులు వినిపించాయి. గౌతమి మాత్రం కమల్ పిల్లల్ని ఏమీ అనలేదు. గత రెండేళ్లుగా ఆమె తన ఒక్కగానొక్క కూతురు సుబ్బులక్ష్మిని హీరోయిన్ గా చేసేందుకు ప్రయత్నిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: