పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ప్రస్తుతం తన దృష్టంతా రాజకీయాల పై పెడుతున్న పవన్ అభిమానులు మాత్రం వచ్చే ఏడాది రాబోతున్న ఎన్నికలలోపు కనీసం ఒక్క సినిమాలో అయినా నటించాలని కోరుకుంటున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితులలో రామ్ చరణ్ పవన్ రికార్డును ఒక విషయంలో బ్రేక్ చేయడం పవన్ అభిమానులకు షాకింగ్ గా మారింది.  
సీడెడ్‌లో రికార్డుస్థాయిలో
ప్రస్తుతం అందరి దృష్టి ‘రంగస్థలం’ చిత్రం పై ఉన్న నేపధ్యంలో ఈమూవీ రిలీజ్ కాకుండానే పవన్ సినిమాల రికార్డును బ్రేక్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు ‘రంగస్థలం’ చేస్తున్న ప్రీ రిలీజ్ బిజినెస్ ట్రేడ్ వర్గాలకు షాక్ ఇస్తోంది. సీడెడ్‌ లో ఈచిత్రం అనూహ్యమైన బిజినెస్ చేయడంమే కాకుండా పవన్ సినిమాల బిజినెస్ కు మించిచేయడం  ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. 
నైజాంలో 20 కోట్లు
రామ్ చరణ్ నటించిన గత సినిమా బిజినెస్‌ లతో  పోల్చుకొంటే ‘రంగస్థలం’ చిత్రం చేస్తున్న బిజినెస్ ఎవరి అంచాలకు అందడం లేదు అని టాక్. ట్రేడ్ ఎనలిస్టుల రిపోర్టు ప్రకారం ‘రంగస్థలం’ సినిమా సీడెడ్ థియేట్రికల్ హక్కులను ఒక ప్రముఖ పంపిణీదారుడు 12.1 కోట్లకు దక్కించుకొన్నట్టు సమాచారం. ‘బాహుబలి’ ని పక్కన పెడితే పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’ చిత్రం 11.7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం సీడెడ్ ప్రాంతంలో ఒక రికార్డు ఈసినిమాను మినహాయిస్తే ఈ టాప్ హీరో సినిమాకు కూడ సీడెడ్ ప్రాంతంలో 10 కోట్లకు మించి బిజినెస్ చేయలేదనేది ట్రేడ్ వర్గాల అభిప్రాయం.  
RAM CHARAN RANGASTHALAM LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే  రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ 12.1 కోట్లకు పైగా బిజినెస్ చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ సినిమాను మించి రామ్ చరణ్ సినిమా బిజినెస్ చేయడం ఎవరికీ అర్ధం కాని విషయంగా మారింది. ఈ చిత్రం మార్చి 30న రిలీజ్‌కు రెడీ అవుతున్న నేపధ్యంలో ఈమూవీ సాధించబోయే కలెక్షన్స్ ఎవరి అంచనాలకు అందని విధంగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రయా పడుతున్నట్లు సమాచారం.. 



మరింత సమాచారం తెలుసుకోండి: