సోషల్ మీడియాలో అభిమాన నటులను డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యే వెసులుబాటు రావడంతో మనసులో ఉన్న ఇష్టాన్ని సైతం చెప్పుకోవడమే కాదు వింత వింత కోరికలను వారి ముందు ఉంచుతున్నారు. ఇక కొందరు ఆకతాయిలైతే హీరోయిన్స్ తో లైవ్ చాట్ లో అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. దీనిపై హీరోయిన్స్ కూడా అదే రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.


రీసెంట్ గా బాలీవుడ్ హీరోయిన్ సోఫీ చౌదరికి ఇలాంటి అనుభూతే ఎదురైంది. సరదాగా ఫ్యాన్స్ తో చాట్ చేస్తున్న ఆమెకు ఓ అభిమాని సడెన్ గా ఒక్క రాత్రికి వస్తావా 20 లక్షలు ఇస్తా అని అన్నాడు. అయితే అందుకు సమాధానంగా సోఫీ చౌదరి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది.  


ఇదే విషయాన్ని మీ అమ్మకి చెప్పు అంటూ అదిరిపోయేలా క్లాస్ పీకింది అమ్మడు. ఓ రకంగా ఇలాంటి వాళ్లతో హీరోయిన్స్ కు ఈమధ్య బాగా హెడేక్ ఎక్కువైందని తెలిసిందే. ముఖ్యంగా పని పాటాలేని ఆకతాయిలు రోజు మొత్తం ఆన్ లైన్ లో ఉండే వాళ్లు ఇలాంటి కామెంట్స్ చేస్తూ సెలబ్రిటీస్ ను ఇబ్బంది పెడుతున్నారు. 


అయితే మాటలు మితిమీరితే మాత్రం సదరు వ్యక్తి మీద లీగల్ యాక్షన్ కు దిగుతున్నారు. సోఫీ చౌదరి కూడ ఇన్ స్టాగ్రాం లో ఎదురైన ఈ అనుభవాన్ని ఫోటో షేర్ చేసి మరి అందరికి షాక్ ఇచ్చింది. మొత్తానికి అమ్మడు తన మీద కామెంట్ చేసి వాడికి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిందని కొందరు ఆమెను మెచ్చుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: