నందమూరి కళ్యాణ్ జూనియర్ ల మధ్య అన్నదమ్ముల సాన్నిహిత్యానికి త్రివిక్రమ్ సూచనలు సమస్యగా మారింది అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ సున్నితమైన సమస్య నుండి ఎలా బయట పడాలో తెలియక జూనియర్ అయోమయానికి గురౌతున్నాడు అన్న గాసిప్పులు వినిపిస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు కళ్యాణ్ రామ్ కోసం జనం ముందుకు రావాలా వద్దా అన్న అయోమయంలో జూనియర్ ఉన్నట్లు టాక్. ప్రస్తుతం జూనియర్ విదేశీ ట్రైనర్ శిక్షణలో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కోసం తన లుక్ ను మార్చుకుంటున్న విషయం తెలిసిందే. 
JUNOR NTR IN TRIVIKRAM MOVIE NEW LOOK PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈలుక్ ను మరి కొంత కాలం రహస్యంగా ఉంచాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈలోగానే జూనియర్ తన అన్న కళ్యాణ్ రామ్ కోసం జనం మధ్యకు రావలసిన పరిస్థుతులు ఏర్పడుతున్నాయి. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘ఎమ్ఎల్ఎ’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 17న ప్లాన్ చేసారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ ఉంది కానీ జనంలో ఈమూవీ పై పెద్దగా క్రేజ్ లేకపోవడం కళ్యాణ్ రామ్ ను కలవర పెడుతోంది అని టాక్. 
KALYAN RAM IN MLA MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈమూవీ మార్కెట్ అయిపోయినా ఈమూవీకి ఇంకా క్రేజ్ రాకపోవడం ఈసినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపధ్యంలో ఈమూవీకి భారీ ఓపెనింగ్స్ రావాలి అంటే ఈమూవీ క్రేజ్ ను పెంచడానికి కళ్యాణ్ రామ్ జూనియర్ ను రంగంలోకి దింపడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అతిధిగా జూనియర్ ను రప్పించాలని కళ్యాణ్ రామ్ తారక్ పై తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు టాక్. అయితే తాను ఎంతో కష్టపడి త్రివిక్రమ్ సినిమా కోసం మార్చుకున్న లుక్ ను ముందుగానే తన అభిమానులకు లీక్ చేయడం జూనియర్ కు ఇష్టం లేదు అని అంటున్నారు. 
KALYAN RAM IN MLA MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే ఈనెల 23న కళ్యాణ్ రామ్ ‘ఎమ్ఎల్ఎ’ సినిమా విడుదలవుతున్న రోజు చాల సినిమాలు విడుదల అవుతున్న నేపధ్యంలో కాంపిటీషన్ చాల గట్టిగానే ఉంది. ఈమూవీకి క్రేజ్ తీసుకు రావాలి అంటే జూనియర్ సపోర్ట్ అవసరమనీ కళ్యాణ్ రామ్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఆ ఫంక్షన్ కు వస్తే తన లుక్ అందరికీ తెలిసిపోతుందని జూనియర్ భయపడుతున్నాడట. దీనితో జూనియర్ ఈ సున్నిత సమస్య పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అన్న ఆసక్తి ఇండస్ట్రీ వర్గాలలో బాగా పెరిగిపోతోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: