తెలుగు ఇండస్ట్రీలోకి దేవదాసు చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన గోవా బ్యూటి ఇలియనా తర్వాత అగ్ర హీరోల సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది.  అతి తక్కువ కాలంలోనే ఈ అమ్మడికి తెలుగు, తమిళ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. దాంతో తెలుగు లో మంచి ఫామ్ లో ఉండగానే బాలీవుడ్ పయణమైంది. తంలో దక్షిణాది సినీ పరిశ్రమ తనను 'అందాల వస్తువు'గా వాడుకుందని తీవ్రంగా విమర్శించిన ఇలియానా..ఇప్పుడు బాలీవుడ్‌ను సైతం ఏకిపారేస్తోంది.
Image result for ileana hot
తన తాజా చిత్రం 'రైడ్' ప్రమోషన్ సందర్భంగా 'బాంబే టైమ్స్' పత్రికతో ఈ హాట్ బ్యూటీ  చీకటి కోణంపై ధైర్యంగా గొంతు విప్పింది. సినీ పరిశ్రమలో లైంగిక హింస గురించి బహిరంగంగా ప్రశ్నించే తారల కెరీర్ ముగిసిపోతుందా? అన్న ప్రశ్నకు, ప్రశ్నించకపోవడం పిరికితనమవుతుందని, కానీ, 'అవకాశాలకు పడక సుఖం' అంశంపై మాట్లాడితే మాత్రం కెరీర్ అంతమవుతుందన్న వాదనతో తాను ఏకీభవిస్తానని ఇలియానా అంటోంది.
Related image
ఎవరైనా నటీనటులు వేధింపులకు గురవుతున్నట్లు చెబితే వారికి మిగిలిన వారు బాసటగా నిలవాలని ఆమె కోరుతోంది. తన వ్యక్తిగత జీవితం గురించి తాను మాట్లాడేందుకు నిరాకరించింది.  అయితే అందుకు తానేమీ చెప్పలేకపోయానని, ఆమె సొంత నిర్ణయానికే వదిలేశానని ఇలియానా చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో కొంతవరకు మాత్రమే తన విషయాల గురించి ప్రస్తావిస్తానని, తనకు నచ్చినంత వరకే పంచుకుంటానని తేల్చిచెప్పేసిందీ భామ.



మరింత సమాచారం తెలుసుకోండి: