‘బాహుబలి’ భారీ సక్సస్ తో రచయిత విజయేంద్ర ప్రసాద్ ఖ్యాతి దేశమంతా తెలిసిపోయింది. ఎన్నో భారీ నిర్మాణ సంస్థలు మరెందరో టాప్ హీరోలు తమ సినిమాల కోసం కథలు వ్రాయించుకోవడానికి విజయేంద్ర ప్రసాద్ చుట్టూ తిరుగుతున్నారు. కోట్ల రూపాయలలో భారీ పారితోషికం తీసుకుంటున్న విజయేంద్ర ప్రసాద్ స్థాయిలో మన ఫిలిం ఇండస్ట్రీలో ఎవరికీ పారితోషికాలు లేవు. 
VIJAYENDRA PRASAD LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇలాంటి పరిస్థుతులలో భారతదేశ రాజకీయాలను శాసిస్తున్న భారతీయ జనతాపార్టీ తమ పార్టీ ఇమేజ్ పెంచుకోవడం కోసం తీయబోతున్న ఒక సినిమా కోసం కథ వ్రాసే బాధ్యత విజయేంద్ర ప్రసాద్ కు అప్పచెప్పింది అని వస్తున్న వార్తలు మీడియా వర్గాలలో హాట్ న్యూస్ గా మారింది. దేశాన్ని పాలిస్తున్నది భారతీయ జనతపార్టీ అయినా ఆ పార్టీ విధానాలను నిర్ణయించే క్రియా శీలక శక్తి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అన్న విషయం ఓపెన్ సీక్రెట్.
VIJAYENDRA PRASAD LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈ పరిస్థుతులలో రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చరిత్ర సిద్ధాంతాల పై ఒక భారీ సినిమాను తీయడానికి ఆ సంస్థ సన్నాహాలు చేస్తోంది. సుమారు 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తీయబోతున్న ఈసినిమాలో ఒక ప్రముఖ బాలీవుడ్ హీరో నటిస్తాడని తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్ మూవీకి కథను స్క్రీన్ ప్లేను వ్రాసే భాద్యత విజయేంద్ర ప్రసాద్ కు అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి. 
VIJAYENDRA PRASAD LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈమూవీని ఈ సంవత్సరం డిసెంబర్ లో విడుదల చేయాలి అని భావిస్తున్న నేపధ్యంలో విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ఈమూవీ స్క్రిప్ట్ పై చాల వేగంగా పనిచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారతీయ జనతాపార్టీకి గుండె లా వ్యవహరించే  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విధానాల పై ఎన్నో వివాదాలు ఉన్న నేపధ్యంలో ఈ వివాదాలు అన్నింటికీ విజయేంద్ర ప్రసాద్ తన స్క్రిప్ట్ లో ఎలాంటి సమాధానాలు అందర్నీ మెప్పించే విధంగా ఇవ్వగలుగుతాడు అన్న విషయం పై అన్ని వర్గాలలోను ఆశక్తి నెలకొని ఉంది..  
 


మరింత సమాచారం తెలుసుకోండి: