అక్కినేని హీరోలు నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ ఈ ముగ్గురు ఈ ఉగాదికి స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే నాగార్జున, వర్మ కాంబినేషన్ లో వస్తున్న ఆఫీసర్ సినిమా స్పెషల్ సర్ ప్రైజ్ ను ఉగాది రోజు ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాతో పాటుగా నాగార్జున నానితో కలిసి చేస్తున్న మల్టీస్టారర్ సినిమా అప్డేట్ కూడా ఉగారి రోజే వస్తుందట.


ఇక నాగ చైతన్య కూడా చందు మొండేటి డైరక్షన్ లో వస్తున్న సవ్యసాచి సినిమా ఫస్ట్ లుక్ కూడా ఉగాది రోజు రిలీజ్ చేస్తున్నారట. అంతేకాదు మారుతి డైరక్షన్ లో చైతు చేస్తున్న శైలజా రెడ్డి అల్లుడు సినిమా టైటిల్ పోస్టర్ కూడా ఉగాదికి వస్తుందని అంటున్నారు. అయితే ఆ విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు.


ఇక అక్కినేని యువ హీరో అఖిల్ తన 3వ సినిమా ప్రకటన కూడా ఉగాది రోజు ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది. మొదటి సినిమా అఖిల్, రెండవ సినిమా హలో ఆశించిన ఫలితాలు సాధించలేదు అందుకే అఖిల్ 3వ సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. రీసెంట్ గా తొలిప్రేమ సినిమాతో హిట్ అందుకున్న వెంకీ అట్లూరి డైరక్షన్ లో ఈ సినిమా వస్తుందట.


బివిఎసెన్ ప్రసాద్ నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. అఖిల్ సినిమా ఎనౌన్స్ మెంట్ కూడా ఉగారి రోజు వచ్చేస్తుందట. సో ఈ ఉగాది అక్కినేని హీరోలు స్పెషల్ గా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చేందుకు ప్లాన్ చేశారు. మరి ఈ ఉగాది స్పెషల్ సర్ ప్రైజ్ ఎలా ఉంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: