తెలుగు సినిమా ఇండస్ట్రీలో అష్టాచమ్మ సినిమాతో హీరోగా మంచి మార్కులు కొట్టిన నాని ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో యావరేజ్ అనిపించుకున్నాడు.  మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమాలో మతిమరుపు పాత్రలో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి ఒక్కసారే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  ఆ తర్వాత వరుస విజయాలతో స్టార్ హీరో హోదాకి ఎదిగిపోయాడు.  ప్రస్తుతం నాని నటించే సినిమాలు ఇక్కడే కాదు ఓవర్సీస్ లో కూడా మంచి లాభాల భాటలో నడుస్తుంది. 
Image result for nani hero
తెలుగు తెరపై నాని జోరు ఒక రేంజ్ లో కొనసాగుతోంది. ఏ మాత్రం గ్యాప్ లేకుండగా ఆయన చకచకా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు.  ఈ ఉగాదికి మల్టీ స్టారర్ సినిమాగా నాగార్జునతో నటించబోతున్నాడు నాని.  ఈ మద్య టాలీవుడ్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. దర్శకుడు విక్రమ్ కుమార్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా అటకెక్కిందనేది తాజా సమాచారం. 
Image result for nani hero
 హీరో నానికి దర్శకుడు విక్రమ్ కుమార్ ఓ కథ వినిపించాడట..ఫస్ట్ పార్ట్ బాగున్నా సెకండ్ పార్ట్ విషయంలో కాస్త డిఫరెంట్ అనిపించడంతో మనోడు వ్యక్తం చేశాడనీ, ఫలితంగా ఆ ప్రాజెక్టు డౌట్లో పడిందనేది ఫిల్మ్ నగర్ టాక్. దాదాపు ఈ ప్రాజెక్టు లేనట్టేనని అంటున్నారు.
Image result for nani hero
మరోవైపు నాని వేరే ప్రాజెక్ట్ కు సై అన్నారట. ఇక విక్రమ్ కుమార్ .. స్వప్న దత్ కి .. మంజుల ఘట్టమనేనికి వేరు వేరు కథలు వినిపించి ఓకే చేయించుకున్నారట. అందువలన ఈ రెండు ప్రాజెక్టులలో ఒకటి త్వరలో పట్టాలెక్కనుందని చెప్పుకుంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: