బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ తనయ సుహానా ఖాన్ బాలీవుడ్ ఎంట్రీ గురించి చాలాకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయిదే అది నిజమా? కాదా? అనే విషయమై పలుమార్లు షారూఖ్-గౌరీ ఖాన్ దంపతుల వద్ద ప్రస్తావిస్తే...వారు సూటిగా సమాధానం ఇవ్వకుండా దాటేసేవారు. తండ్రి బాలీవుడ్ బాద్ షా కుమార్తె త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని ముచ్చటపడుతోందట. ముచ్చపడితే సరిపోదు కదా… ఈ అమ్మాయి గురించి పట్టించుకునే వారు కూడా కావాలి కదా. అందుకే ఈ అమ్మాయి కసరత్తులు మొదలుపెట్టింది.

Related image
మీడియా దృష్టిలో పడటానికి తనదైన స్కెచ్ వేయడానికి రెఢీ అవుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.  ఈ విషయం ముంబైలో ఇటీవల జరిగిన ఓ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా గౌరీ ఖాన్ ఎట్టకేలకు ఓ విషయాన్ని స్పష్టం చేసింది.  సుహానా బాలీవుడ్ ఎంట్రీ ఇంకెంతో దూరం లేదు. ఏ క్ష‌ణం అయినా త‌న డెబ్యూ ప్రాజెక్టును ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని మామ్ గౌరీఖాన్ నుంచి ఓ లీకేజీ అందింది.
Related image
త్వ‌ర‌లోనే ఓ ప్ర‌ఖ్యాత మ్యాగ‌జైన్ క‌వ‌ర్‌పేజీ పై సుహానా ద‌ర్శ‌న‌మీయ‌నుంది. అయితే ఆ మ్యాగ‌జైన్ ఏది అనేది ఇప్పుడే చెప్ప‌న‌ని గౌరీఖాన్ లీక్ ఇవ్వ‌డం బాలీవుడ్ స‌హా స‌ర్వ‌త్రా హాట్ టాపిక్ అయ్యింది. ఆ మ్యాగ‌జైన్ ఏది? అనేది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్‌. దీనిపై ఇప్పటికే బాలీవుడ్ లో రక రకాలుగా చర్చలు సాగుతున్నాయి. 
Related image
తన తండ్రి అడుగుజాడల్లోనే తానూ పయనిస్తానని, నటననే తన జీవిత లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ కుమార్తె సుహానా తన మనసులోని మాటను చెప్పేస్తోంది. సోనాక్షి, సోన‌మ్, జాన్వీ క‌పూర్‌, అహ‌నా పాండే, సారా అలీఖాన్ త‌ర‌హాలోనే కింగ్ ఖాన్ న‌ట‌వార‌సురాలి ఎంట్రీ అంతే ఘ‌నంగా ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: