తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు.  నాగార్జున లుకింగ్ లో చాలా మోడ్రన్ గా ఉంటారు..అందుకే ఆయనను మన్మధుడు అని పిలుస్తారు.  మాస్,క్లాస్ లుక్స్ తో కనిపించే నాగార్జున రెండేళ్ల క్రితం చేసిన ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 
Related image
ఓ వైపు నాగార్జున తనయులు నాగచైతన్య, అఖిల్ లు హీరోగాలుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ నాగ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.  ప్రస్తుతం సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ‘ఆఫీసర్’ చిత్రంలో నటిస్తున్నాడు.  అయితే కళ్యాన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయన’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం సీక్వెల్ రాబోతుందని వార్తలు సందడి చేశాయి.   
Image result for soggade chinni nayana
దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాలో బంగార్రాజు పాత్రను మలిచిన తీరు అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో సీక్వెల్ రూపొందించాలని నాగ్ అప్పట్లో అనుకున్నాడు.
Image result for soggade chinni nayana kalyan krishna
కానీ కళ్యాణ్ కృష్ణ అందించిన బంగార్రాజు స్క్రిప్ట్ అంతగా సంతృప్తి పరంగా లేకపోవడంతో కార్యరూపం దాల్చలేదు.  రీసెంట్ గా మరో అద్భుతమైన కథ తీసుకు పోవడంతో నాగ్ ఇంప్రెస్ అయ్యి సినిమా చేద్దామని అన్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: