స్టార్ హీరో స్టేటస్ వచ్చాక హీరోలు ఎలా ఉన్నా ఎలా చేసినా సినిమాలు ఆడే పరిస్థితి మారింది. అందుకే స్టార్ హీరోలు కూడా సినిమా కంటెంట్ దగ్గర నుండి లుక్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమా సినిమాకు పూర్తి మేకోవర్ తో కనిపిస్తున్న స్టార్స్ లో ఇప్పుడు రాం చరణ్ స్పెషల్ అని అంటున్నారు. 


అలా ఎందుకు అంటే ఒకటి రెండు కాదు ఏకంగా 480 రోజులు ఒక సినిమా కోసం తను గెడ్డంతో ఉన్నాడు. ఇక అది ఏ సినిమా కోసమే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా. సుకుమార్ డైరక్షన్ లో రాం చరణ్ హీరోగా వస్తున్న సినిమా రంగస్థలం. ఈ సినిమాలో చిట్టిబాబుగా చరణ్ లుక్ కొత్తగా కనిపిస్తుంది.


అయితే ఈ పాత్ర కోసం చరణ్ గెడ్డం లుక్ తో కనిపించాల్సి వచ్చింది. ధ్రువ తర్వాత నుండి గెడ్డం పెంచడం స్టార్ట్ చేసిన రాం చరణ్ సినిమా పూర్తయ్యే దాకా అంతే ఉంచుకున్నాడట. చరణ్ కమిట్మెంట్ కు చిత్రయూనిట్ అంతా షాక్ అయ్యారని తెలుస్తుంది. సుకుమార్ తో మొదటిసారి సినిమా చేస్తున్న రాం చరణ్ ఈ లుక్ తో ఫ్యాన్స్ నే కాదు సిని ప్రియులను అలరిస్తున్నాడు.


ఇక ఈ సినిమాతో పాటుగా రాం చరణ్ బోయపాటి సినిమా చేస్తున్నాడు. బోయపాటి మార్క్ సినిమాగా రాబోతున్న ఆ సినిమాలో కూడా చరణ్ మాస్ లుక్ లోనే కనిపిస్తాడట. ఇక ఈ రెండు సినిమాల తర్వాత రాజమౌళి మల్టీస్టారర్ లో కూడా చరణ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. చూస్తుంటే చరణ్ రాబోయే రెండేళ్లు తన సత్తా ఏంటో చూపించనున్నాడని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: