బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే అంటే తెలియని వారు ఉండరు.  తీసింది కొన్ని సినిమాలే అయినా..ఎప్పుడూ కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తూ..సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.  ఆ మద్య సహజీవనం పై బోల్డ్ గా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచింది..అవును ఇద్దరు కలిసి కొంత కాలం జీవించి తర్వాత నచ్చితే పెళ్లి చేసుకుంటారు..లేదంటే విడిపోతారు. అలాంటివి పాశ్చాత్య దేశాల్లోకామన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. 
Related image
ఆ తర్వాత దక్షిణాది హీరోలపై విమర్శలు గుప్పించింది..అక్కడ హీరోయిజానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని..హీరోయిన్లు గ్లామర్ కోసమే వాడుకుంటారని ఘాటైన వాఖ్యాలుచేసింది.  తన బాయ్ ఫ్రెండ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయంపై  బీచ్ లో బికినీలు వేసుకోక షారీలు కట్టుకొని తిరుగుతారా అంటూ...నెటిజన్లపై తీవ్ర విమర్శలు చేసింది. తాజాగా మరోసారి దక్షిణాది హీరోపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
Image result for radhika apte hot
తాను నటించిన తొలి దక్షిణాది సినిమా షూటింగ్ లో ఓ ప్రముఖ హీరో త‌న‌తో అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించ‌డంతో అత‌డి చెంపఛెళ్లుమ‌నిపించాన‌ని సినీన‌టి రాధికా ఆప్టే చెప్పింది. తాను షూటింగ్ సెట్‌కి వెళ్లిన తొలి రోజే త‌న‌కు ఈ అనుభ‌వం ఎదురైంద‌ని తెలిపింది. స‌ద‌రు హీరో తన పక్కనే కూర్చొని, తన కాలిని అసభ్యంగా రుద్దాడని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.
Image result for radhika apte hot boyfriend beach
గతంలో ఆ హీరో ముఖం కూడా తెలియదని  క‌నీసం పరిచయం కుడా లేడ‌ని తెలిపింది. సినీ న‌టీమ‌ణుల్లో చాలా మంది వ‌రుస‌గా తాము గ‌తంలో లైంగిక వేధింపుల‌కు గురైన విష‌యాల‌ను చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు. రాధికా ఆప్టే తెలుగులో లెజెండ్‌, లయన్‌, రక్తచరిత్ర వంటి సినిమాలలో న‌టించింది. త‌మిళంలో ‘కబాలి’ సినిమాలోనూ న‌టించిన విష‌యం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: