అర్జున్‌ రెడ్డి సినిమాతో సౌత్‌ లోమోస్ట్‌ వాంటెడ్‌ హీరోగా మారిపోయాడు యువ నటుడు విజయ్‌ దేవరకొండ. అర్జున్‌రెడ్డి సినిమా విడుదలకు ముందే ఎంత వివాదాస్పదమైందో తెలిసిందే. వివాదాస్పదంతోపాటు బోలెడంత ఫ్రీ పబ్లిసిటీని కూడా సంపాదించిన విషయం తెలిసిందే. దాంతో అర్జున్‌ రెడ్డి సినిమాతో సౌత్‌ లోమోస్ట్‌ వాంటెడ్‌ హీరోగా మారిపోయాడు యువ నటుడు విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం ఈ హీరో చేతి నిండా సినిమాతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు.
Related image
ప్రస్తుతం రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఓ ట్రావెల్‌ డ్రామాలో నటిస్తున్న ఈ విజయ్‌ ఈ సినిమాతో పాటు మహానటి షూటింగ్‌లోనూ పాల్గొంటున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న నోటా షూటింగ్‌కు రెడీ అవుతున్నాడు.  ఆ మద్య అర్జున్‌రెడ్డి సినిమాను ఆకాశానికి ఎత్తేశారు. హైదరాబాద్ టైమ్స్ లేటెస్ట్ గా నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్‌ మెన్ 2017 లిస్టులో టాలీవుడ్ స్టార్లకు షాక్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ.
Image result for ram gopal varma vijay devarakonda
తాజాగా ప్రస్తుతం నాగార్జునతో ‘ఆఫీసర్’ చిత్రం షూటింగ్ బిజీలో ఉన్నాడు రాంగోపాల్ వర్మ.  ఈ చిత్రం తర్వాత విజయ్ దేవరకొండతో ఓ సినిమా తెరకెక్కించాలని  ప్లాన్ చేసినట్టుగా వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతం వర్మ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేని..నో చెప్పేసి వర్మకు షాక్ ఇచ్చాడట తర్వాత తన సాధ్యాసాధ్యాలను వర్మకు విజయ్ వివరించినట్టు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: