టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో వచ్చిన యమలీల సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఇంద్రజ. ఇంద్రజ తొలిసినిమా జంతర్ మంతర్ అయితే యస్వీ కృష్ణారెడ్డి తీసిన యమలీల ముందుగా విడుదలై పెద్ద విజయం సాధించింది. యమలీల తర్వాత ఇంద్రజ రెండు సంవత్సరాల్లో 30కి పైగా సినిమాలలో పనిచేసింది. గుణశేఖర్ తీసిన సొగసు చూడతరమా సినిమాలో ఇంద్రజ నటన పలువురు విమర్శకుల ప్రశంసలందుకున్నది. తెలుగు, మళియాళ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించింది ఇంద్రజ.
Image result for actress indraja krishna
పెళ్ళి చేసుకుని సినిమాలకు స్వస్తి చెప్పిన ఇంద్రజ 2005లో జయా టీవీలో శాస్త్రీయ నృత్యంపై ఆధారితమైన గేంషో తకదిమిథకు యాంకరుగా కూడా పనిచేసింది.ఇటీవలి కాలంలో, ఈమె టీవీ సీరియల్లలో నటించింది. సుందరకాండ అనే తెలుగు సీరియల్లో ప్రతినాయకి పాత్రను పోషించింది. భైరవి అనే తమిళ సీరియల్లో ప్రత్యేక పాత్రలో కనిపించింది. ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ లో జరిగిన కొన్ని సంఘటల గురించి ఇంద్రజ చెప్పింది.  ఇంద్రజకి మంచి గుర్తింపు తెచ్చిన చిత్రాలలో 'అమ్మదొంగా' ఒకటి.
Related image
ఈ సినిమాలో ఆమె సూపర్ స్టార్ కృష్ణ సరసన నటించారు. దర్శకులు సాగర్ గారు నన్ను చూసి .. ఈ అమ్మాయి మరీ చిన్నపిల్లలా వుంది అని చెప్పేసి పంపించేశారు. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదుగానీ .. ఉన్నావని చెప్పారు. ఇక షూటింగ్ లో కృష్ణగారితో నటించాను..అయితే తన యాక్టింగ్ సరిగా ఉందా..?లేదా...? అన్న విషయం ఏమీ చెప్పలేదు.
Image result for actress indraja
దాంతో నాకు భయం వేసింది.. .. నామీద ఏమైనా కోపమా? ఆయన టైమింగ్ ను అందుకోలేకపోతున్నానా? అనే విషయం అర్థంకాక ఫస్టు డే సెట్లో ఏడ్చేశాను. ఆ తర్వాత ఆయన మేకప్ మేన్ .. హెయిర్ డ్రెస్సర్ వచ్చి కృష్ణగారు అంతే ఎవరితో మాట్లాడరు..తన పని తాను చేసుకొని వెళ్తారని అన్నారు.  తరువాత కృష్ణగారు ఎంత సింపుల్ గా వుంటారనేది అర్థమై ఆశ్చర్యమేసింది" అంటూ చెప్పుకొచ్చారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: