పవన్ కళ్యాణ్ గుంటూరు లో భారి భహి రంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ తన హత్య కు ప్లాన్స్ వేస్తున్నారని, గుంటూరులో ఎటాక్ జరగవచ్చని స్వయంగా పవన్ కళ్యాణ్ డిజిపి కి లేఖ రాయడం కల కలం రేపుతుంది. ఏమైనా బెదిరింపు కాల్స్ వ‌చ్చాయా లేక ఇంటలిజెన్స్ వ‌ర్గాల రిపోర్ట్ ఆధారంగా ప‌వ‌న్ కు ఎవ‌రైనా లీకులిచ్చారా అన్న‌దానిపై అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.
Image result for pavan kalyan janasena
లేకుంటే ప‌వ‌న్ ఎందుక‌లా హ‌త్య‌కు సంబంధించి ఏపీ డీజీపీకి లేఖ రాస్తారంటూ ప్ర‌శ్న‌లు తలెత్తుతున్నాయి. తాను గుంటూరులోని నాగార్జున వ‌ర్సిటీలో త‌ల‌పెట్టిన జ‌న‌సేన ఆవిర్భావ బ‌హిరం స‌భ‌కు హాజ‌ర‌వుతున్నాన‌ని, ఒక‌వేళ త‌న‌పై ఎవ‌రైనా ఎటాక్ చేస్తే మాత్రం అది ప్ర‌జాజీవితంపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తుందంటూ డీజీపీకి రాసిన లేఖ‌లో పేర్కొన‌డం ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.ఇందుకు సంబంధించి గ‌తంలో జ‌రిగిన రెండు మూడు ఘ‌ట‌న‌లను ఉదాహ‌ర‌ణగా చూపుతూ ప‌వ‌న్ లేఖ‌లో పేర్కోన్నారు. అయితే, పవ‌న్ లేఖ‌పై ప‌లువురు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు సైతం బెంబేలెత్తుతున్నారు.త‌మ నాయ‌కుడి ఆవేద‌న వెన‌క నిజంగానే ఏదో కుట్ర  దాగిఉంద‌ని, అధినేత‌కు అందిన స‌మాచారం కార‌ణంగానే లేఖ రాయాల్సి వ‌చ్చింద‌ని అంటున్నారు.
Image result for pavan kalyan janasena
అయితే ప‌వ‌న్ ను అంత‌మొందించ‌టం ఎవ‌రి త‌రం కాద‌ని,ఒక‌వేళ అలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగితే మాత్రం  ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఇక ప‌వ‌న్ లేఖ‌పై డీజీపీ సీరియ‌స్ గా స్పందించారు.జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చూసేందుకు చ‌ర్య‌లు  చేప‌ట్టారు.భారీగా పోలీసులతో బందోబ‌స్తును ఏర్పాటు చేశారు.ఎక్క‌డిక‌క్క‌డ త‌నిఖీలు నిర్వ‌హిస్తూ గుంటూరును అల‌ర్ట్ చేశారు. భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న ప‌వ‌న్ కు ఎలాంటి స‌మ‌స్య ఎదురైనా దాని మూల్యం భారీగానే చెల్లించుకోవాల్సి ఉంటుంది కాబ‌ట్టి,దాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసు అధికారులంతా గుంటూరు స‌భ‌కు వ‌చ్చే దారుల్లో ముమ్మ‌రంగా త‌నిఖీలు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: