ఒరు అడర్ లవ్ అనే మలయాళ సినిమా టీజర్ తో యువత మనసు దోచేసిన అందం ప్రియా ప్రకాశ్ వారియర్ ది. ప్రియా ప్రకాశ్  గురించే ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఆమె హావభాబాలు అంతగా ప్రభావం చూపించడంతో.. రాజకీయ నాయకులు కూడా ప్రియా పేరును.. ఫొటోలను తమ అవసరాల కోసం వాడేసుకుంటున్నారు. ముఖ్యంగా.. ప్రియా సొంత రాష్ట్రం కేరళలో ఈ తీరు బాగా కనిపిస్తోంది.
Image result for priya prakash warrier
ఇప్పుడు ప్రియా ప్రకాష్ వారియర్ ఇండియాలో బిగ్ సెలెబ్రిటీ. యువత మొత్తం ప్రియా జపం చేస్తోంది. ఓరు ఆదార్ లవ్ చిత్రంలోని ఓ పాటతో ప్రియా ఫేమస్ అయిపోయింది. కుర్ర హృదయాలకు కళ్లెం వేసే విధంగా ఉన్న ఆమె హావభావాలు ఇంటర్ నెట్ లో సెన్సేషన్ గా మారిపోయాయి. ప్రియా ప్రకాష్ వారియర్ బాలీవుడ్ బిగ్ స్టార్స్ కన్నా కాస్ట్లీ అయిపోయింది.  మొత్తానికి ఒకే ఒక్క సీన్‌తో 'కన్నుకొట్టి' కుర్రకారును తనవైపు తిప్పుకున్న కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్ వారియర్.
Image result for priya prakash warrier
ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా అందరూ ఈ భామకు ఫిదా అయిపోయారు. తాజాగా  యువకుల గుండెల్లో గిలిగింతలు పెట్టిన ప్రియా ప్రకాశ్ వారియర్‌ ఫోటో షూట్ తో మరోసారి మెస్మరైజ్ చేసింది.

ఓర కంటి చూపుతో యువత గుండెకు గాలమేసిన ఈ ముద్దుగుమ్మ తాజా ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గులాబి రంగు లాంగ్‌ ఫ్రాక్‌ లో మెరిసిన ప్రియా ప్రకాశ్ వారియర్ కు... ఈ ఫోటో షూట్ తరువాత మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉందని సినీ ప్రేమికులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఆమె 'టెంపర్' రీమేక్ 'సింబా'లో రణ్ వీర్ సింగ్ సరసన ఎంపికైందన్న వార్త బీటౌన్ లో హల్ చల్ చేస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: