విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ‘రంగస్థలం’ చిత్రం పై ఇండస్ట్రీ సర్కిల్స్ లో అదేవిధంగా  మెగా అభిమానులలో విపరీతంగా  అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. 1985 నాటి పరిస్థితులకు అనుగుణంగా ‘రంగస్థలం’ మూవీని దర్శకుడు సుకుమార్ చాల అందంగా తీసినట్లు తెలుస్తోంది. ఈమూవీలో రామ్ చరణ్ వినికిడి లోపం ఉన్న యువకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. 
మరో క్లూ ఇచ్చాడు
ఈపాత్రలో చరణ్ అద్భుతంగా నటించాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఈచిత్రంలో రక్తికట్టించే రాజకీయ సన్నివేశాలు కూడ ఉన్నట్లు తెలుస్తోంది. ఈవిషయం గురించి గతంలోనే వార్తలు వచ్చాయి. రంగస్థలం చిత్రంలో రాజకీయ అంశాలు ఉన్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ క్లూ ఇచ్చింది. హీరో ఆది పినిశెట్టి ఈచిత్రంలో రామ్ చరణ్ సోదరుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. 
రాజకీయ రంగస్థలం వెండి తెరమీదే
ఆది పినిశెట్టి లుక్ ఇటీవల సోషల్ మీడియాలో కూడ తెగ హడావిడి చేసింది. లాంతర్ గుర్తుకే మీఓటు అంటూ ఆది లుక్ కనిపిస్తూ ఉంటే ఎన్నికలలో పోటీ చేస్తున్న తన సోదరుడిని అతడి ప్రత్యర్ధుల నుంచి రక్షించి ఎన్నికలలో గెలిపించే చిట్టిబాబు పాత్రలో చరణ్ నటిస్తున్నాడు. అయితే  వినికిడి లోపం ఉన్న చిట్టిబాబు తన సోదరుడిని గెలిపించడం సాధ్యమేనా ? అంటూ కొందరు చరణ్ చిట్టిబాబు పాత్రపై అదేవిధంగా దర్శకుడు సుకుమార్ పై సెటైర్లు వేస్తున్నారు.  
చిట్టిబాబుకు ఎలా సాధ్యం
1985 పరిస్థితుల నేపథ్యంలో సుకుమార్ రాసుకున్న ఈకథను అప్పటి పరిస్థుతులు ప్రతిభింభించేలా ఈసినిమాను తీస్తున్నారు. ఆసమయంలో కోస్తా జిల్లాలలోని వాతావరణానికి తగ్గట్టుగా సెట్లు వేసి ఈమూవీ చిత్రీకరణ నిర్వహించారు. ఈసినిమా చూసినంత సేపు 1985 కాలంలోకి వెళ్లిన అనుభూతి  కలుగుతుంది అని ఇన్ సైడ్ టాక్. ఈ చిత్రంలో రక్తి కట్టించే రాజకీయ సన్నివేశాలు ఈమూవీకి హైలెట్ గా మారుతాయి. ఇది ఇలా ఉండగా ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను విశాఖపట్నంలోని ఆర్ కే బీచ్ ప్రాంతంలో నిర్వహిస్తున్న నేపధ్యంలో అత్యధిక స్థాయిలో మెగా అభిమానులను రప్పించి మెగా అభిమానులను రప్పించి మెగా స్టామీనాకు  నిదర్శనంగా ఈఫంక్షన్ ను మార్చడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: