టాలీవుడ్ ఇండస్ట్రీలో శివ సినిమాలో విలన్ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా మారిన నటుడు జె.డి. చక్రవర్తి.  ‘గులాబి’ సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న జె.డి. చక్రవర్తి తర్వాత హీరోగా మంచి సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించాడు. నిర్మాత,దర్శకుడిగా కొన్ని సినిమాలు తీసిన జె.డి. చక్రవర్తి బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించాడు. 
Image result for జె.డి. చక్రవర్తి
ప్రస్తుతం విలన్, క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తున్న జె.డి. చక్రవర్తి  అమ్మరాజశేఖర్ దర్శకత్వంలో నక్షత్ర మీడియా పతాకంపై రాజశేఖర్ నిర్మించిన యాక్షన్ కామెడీ థ్రిల్లర్ ‘ఉగ్రం’ సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాత మాట్లాడుతూ ‘‘కొంతగ్యాప్‌ తర్వాత జె.డి చక్రవర్తి చేస్తున్న చక్కని యాక్షన్‌ కామెడీ థ్రిల్లర్‌ ఇది. ‘సత్య’ తరహాలో ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది. నేపథ్య సంగీతాని కి, యాక్షన్‌కి మంచి స్కోప్‌ ఉంది. ఉగాదికి ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు.
Image result for జె.డి. చక్రవర్తి
జె.డి కెరీర్‌లో ప్రత్యేకంగా నిలుస్తుంది. యూత్‌ని ఆకట్టుకునే అంశాలతో దర్శకుడు అమ్మ రాజశేఖర్ అద్భుతంగా తెరకెక్కించాడు. యాక్షన్, సంగీతానికి మంచి స్కోప్ ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా దర్శకుడు అద్భుతంగా తీర్చిదిద్దాడు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు.

అక్షిత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మనోజ్‌నందం, బెనర్జీ, ఆర్‌పి, చమ్మక్‌చంద్ర, శ్రీరామ్‌చంద్ర, టార్జన్, సంపూర్ణేష్ బాబు, శాని, రాజుభయ్ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: జాన్‌భూషణ్, కెమెరా: అంజి, ముజీర్ మాలిక్, ఎడిటింగ్: ఎస్.శ్రీనివాస్, సహ నిర్మాత: బండి శివ, నిర్మాత: నక్షత్ర రాజశేఖర్, దర్శకత్వం: అమ్మ రాజశేఖర్.


మరింత సమాచారం తెలుసుకోండి: