ఈ నెల 29న బాలకిష్ణ తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ కు శ్రీకారం చుడుతున్నాడు. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ కు విడుదల చేయాలి అని బాలయ్య చేస్తున్న ఆలోచనలకు వెంకటేష్ వ్యూహాలు అడ్డుపడుతున్నట్లు సమాచారం. తాము తీసే సినిమాల బిజినెస్ వ్యవహారంలోనే కాకుండా తాము నిర్మించే సినిమాల కథల విషయంలో కూడ ఎటువంటి రాజీకి ఆస్కారం ఇవ్వరు సురేశ్ బాబు వెంకటేష్. 
VENKATESH  LATEST LOOK IN TEJA MOVIE కోసం చిత్ర ఫలితం
ఈ పరిస్థుతులలో వెంకటేష్ తేజ కాంబినేషన్ లో ప్రారంభం అయిన సినిమాకు ఇంకా తేజ మార్పులు చేర్పులు చేయడం అటు వెంకటేష్ కు కానీ ఇటు సురేశ్ బాబుకు కానీ ఏమాత్రం నచ్చడంలేదు అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. ఈ మూవీ షూటింగ్ ను మార్చి ఏప్రియల్ మే లలో వేగంగా పూర్తి చేసి జూన్ నుండి ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ కు వెళ్ళాలని తేజా ఆలోచన అని అంటున్నారు. 
VENKATESH  LATEST LOOK IN TEJA MOVIE కోసం చిత్ర ఫలితం
అయితే తేజా కథను పూర్తి చేసిన తరువాత మాత్రమే తమ మూవీ షూటింగ్ మొదలు పెట్టమని వెంకటేష్ సురేశ్ బాబులు చెపుతున్నట్లు టాక్. దీనితో ఎన్టీఆర్ బయోపిక్ శాస్త్రానికి ఈ నెల మొదలు పెట్టినా వచ్చే జూన్ తరువాత మాత్రమే ఈ మూవీ షూటింగ్ మొదలయ్యే ఆస్కారం ఉంది అని అంటున్నారు. 
VIDYA BALAN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈ మూవీలో అత్యంతకీలకమైన ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రను చేయడానికి ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ కూడ తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో బసవతారకం పాత్ర పోషించగల నటి కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతూనే ఉంది అని టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: