గత కొంతకాలంగా టాప్ హీరోల సినిమా విడుదల ముందు ఏదో ఒక  వివాదం రావడం సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది. గత ఏడాది ‘దువ్వాడ జగన్నాధం’ సినిమాలోని 'గుడిలో బడిలో' పాట పై జరిగిన వివాదం మీడియాకు హాట్ న్యూస్ గా మారడమే కాకుండా ‘డిజె’ సినిమా పబ్లిసిటీకి పరోక్షంగా ఎంతో సహకరించింది. ఇప్పుడు మళ్ళీ  ‘రంగస్థలం’ మూవీలోని ఒకపాట విషయంలో వివాదం రాజుకుంటోoది.
RANGAMMA SONG IN RANGASTHALAM MOVIE PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈమూవీలోని  ‘రంగమ్మ మంగమ్మ’ పాట అందరికీ బాగా నచ్చడంతో    ఈ పాట పది మిలియన్ల వ్యూస్ వైపు పరుగులు పెడుతోంది. అయితే ఇప్పడు ఈపాటపై అఖిల భారత యాదవ సంఘం ప్రతినిధులు అభ్యంతరం వ్యక్త పరుస్తున్నారు. ఈపాటకు సంబంధించిన చరణంలో ‘గొల్లభామ వచ్చి గోళ్ళు గిల్లుతుంటే’ అనే పదాలు తమ జాతి  స్త్రీల మనోభావాలు దెబ్బ తినేలా ఉన్నాయని యాదవ సంఘ నాయకులు అభిప్రాయ పడుతున్నారు. దీనితో ఆ లిరిక్ లోని ఆ పదాలను వెంటనే తొలగించమని కోరుతున్నారు. 
RANGAMMA SONG IN RANGASTHALAM MOVIE PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే  ఈ అభ్యంతరాలను  రంగస్థల దర్శక నిర్మాతలు పట్టించుకోక పోతే  తాము ఆందోళన చేస్తామని కూడ హెచ్చరికలు ఇస్తున్నారు. ఈవిషయమై  ‘రంగస్థలం’ టీమ్ ఇంకా స్పందించలేదు అని తెలుస్తోంది. వాస్తవానికి ఈపాటను చంద్రబోస్ రాసిన నేపధ్యంలో ‘గొల్లభామ వచ్చి గోళ్ళు గిల్లడం’ అనే పదాల్లో అభ్యంతరం ఏమిటి అన్న  అభిప్రాయంలో ఈసినిమా యూనిట్ ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయంలో   సుకుమార్ కాని చంద్రబోస్ కాని ఓపెన్ గా ఈ విషయం పై స్పందిస్తే  తప్ప ఈవివాదం పై క్లారిటీ  వచ్చే అవకాసంలేదు అని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు కేవలం పాటలో రైమింగ్ కోసం ఈ పదం వాడినట్లు తెలుస్తోంది.
 ఇది ఇలా ఉండగా 

‘రంగస్థలం’ ఆల్బంలో చివరగా వినిపించే పాట ‘జిగేలురాణి’ ఐటెం సాంగ్ కొన్ని ద్వందార్ధాలు వచ్చే పదాలు ఉన్నాయి అన్న ప్రచారం జరుగుతోంది.    ఐటెమ్ సాంగ్స్ అందించడంలో తన ప్రత్యేకతను చాటే దేవిశ్రీప్రసాద్  ఇరగదీసే రేంజ్ లో జిగేలు రాణి పాటను కంపోజ్ చేసాడు. ఈ పాట క్యాచీగా ఉందటే కాకుండా బీట్ అదిరిపోయింది అని టాక్. దీనికితోడు పూజా హెగ్డే గ్లామర్ షో ఈపాటకు కీలకం కావడంతో ఈపాటకు థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం అనే మాటలు వినిపిస్తున్నాయి..
  



మరింత సమాచారం తెలుసుకోండి: