టాలీవుడ్ లో సీనియర్ హీరోలంతా కలిసొచ్చే కథలవైపు ఫోకస్ పెంచితే నాగార్జున మాత్రం ట్రెండ్ సెట్ చేసేందుకు ప్లాన్ చేశాడు. ప్రజెంట్ రామ్ గోపాల్ వర్మ మేకింగ్ లో ఆఫీసర్ గా రెడీ అవుతున్న నాగ్.. త్వరలో మల్టీస్టారర్ మూవీలో నటించబోతున్నాడు.. ఇంత వరకూ ఓకే కానీ ఎప్పుడో పట్టాలు తప్పిన  ప్రాజెక్ట్ ని తిరిగి సెట్స్ పైకి తీసుకువెళ్లబోతున్నాడు నాగ్. బంగార్రాజుగా గెటప్ మార్చి వచ్చే సంక్రాంతికి దాడి చేయబోతున్నాడు.

Image result for NAGARJUNA AND KALYAN KRISHNA

టాలీవుడ్ లో లాస్ట్ ఇయర్ రాజుగారి గది-2లో మెంటలిస్ట్ గా కనిపించి బ్లాక్ బస్టర్ హిట్ ని ఎకౌంట్ లో వేసుకున్న హీరో నాగార్జున. ఈ సినిమా తరువాత వర్మ మేకింగ్ లో ఓ యాక్షన్ ఫిల్మ్ కి మూవ్ అయ్యాడు. ఇప్పటికే ముంబైతో పాటు పలు లొకేషన్లలో ఆఫీసర్ సినిమా షూటింగ్ ఫినిష్ అయింది. దీంతో హైదరాబాద్ షిప్ట్ అయ్యాడు నాగ్. ప్రజంట్ పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ స్పీడందుకోవడంతో మే 25న ఈ సినిమాని రిలీజ్ చేయలనే ప్లాన్ లో ఉంది ఫీల్మ్ టీం.

Image result for NAGARJUNA

ఆర్జీవి, నాగ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఫినిష్ అవ్వడంతో నెక్ట్ మూవీపై ఫోకస్ పెట్టాడు నాగ్. వైజయంతీ మూవీస్‌ పతాకంపై శ్రీరామ్‌ ఆదిత్య డైరెక్షన్ లో నానీతో కలిసి ఓ ఈ మల్టీస్టారర్ మూవీని స్టార్ట్ చేయబోతున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తవ్వడంతో ఉగాది నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ స్టార్ట్ కాబోతుంది.

Image result for NAGARJUNA

ఇలా రెండు సినిమాలను రెడీ చేస్తూనే మరోవైపు మరుగున పడిపోయిన బంగార్రాజు కథని తెరపైకి తీసుకువస్తున్నాడు నాగ్. నిజానికి గతంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా ఎంత హిట్ అయిందో, ఆ సినిమాలో బంగార్రాజు పాత్ర అంత పాపులర్ అయింది. దీంతో బంగార్రాజు టైటిల్ తో ఓ సినిమా చేస్తానని చెప్పిన నాగార్జున.. దానికి కూడా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ అని క్లారిటీ కూడా ఇచ్చాడు. కట్ చేస్తే.. తరువాత ఈ సినిమా రకరకాల కారణాల వల్ల మూలన పడింది. దీంతో రవితేజతో సినిమా చేయడానికి మూవ్ అయ్యాడు కళ్యాణ్ కృష్ణ.

Image result for NAGARJUNA AND KALYAN KRISHNA

ప్రజంట్ ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాదిలో ఎలాగైనా బంగార్రాజు సినిమా పూర్తి చేయాలని నాగ్ డిసైడ్ అయ్యాడట. అందుకే కళ్యాణ్ కృష్ణ చేస్తున్న రవితేజ సినిమా పూర్తయిపోగానే బంగార్రాజు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని సమాచారం పంపాడట. నాగ్ చేయబోయే నాని మల్టీస్టారర్ మూవీ పూర్తయిన వెంటనే బంగార్రాజు ప్రాజెక్ట్ కి మూవ్ అవుతాడట. వీలయితే 2019 సంక్రాంతికి బంగార్రాజును థియేటర్స్ లో దింపాలనే ప్లాన్ లో ఉన్నాడట నాగ్. అలా సింగిల్ ఇయర్ లో 3 సినిమాలు రిలీజ్ చేసి సీనియర్స్ లో ది బెస్ట్ అనిపించుకోవలనే ప్లాన్ లో ఉన్నాడు నాగ్. మరి తన ప్లాన్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: