తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు సినీ నటులపై బయోపిక్ చిత్రాలు తీస్తున్నారు.  ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ‘మహానటి’ తెరకెక్కిస్తున్నారు.  తెలుగు ఇండస్ట్రీలో నటసార్వభౌములుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న మహానటులు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ‘ఎన్టీఆర్’ బయోపిక్ చిత్రాన్ని ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ తెరకెక్కిస్తున్నారు.  ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు.  తేజ దర్శకత్వం వహించబోతున్న ఈ మూవీ మార్చి 29 న ప్రారంభంకానుంది.
Image result for ntr biopic
ప్రస్తుతం ఈ సినిమాకు సంభందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగానే ఎన్టీఆర్ భార్య బసవతారకంగారి పాత్ర కోసం బాలీవుడ్ నటి విద్యా బాలన్ ను సంప్రదించినట్లు వార్తలు వినిపించాయి.ఇందులో బాలకృష్ణ ఎన్టీఆర్ గా 62 గెటప్స్ తో కనిపించనున్నారు. తేజా డైరెక్ట్ చేస్తున్న ‘ఎన్టీయార్’ మూవీ.. నటీనటుల ఎంపిక విషయంలో కొద్దికొద్దిగా ప్రోగ్రెస్ చూపెడుతోంది. 
Image result for ntr biopic
డర్టీ పిక్చర్ తో భారీ అందాలను ఉదారంగా ఆరబోసి కుర్రాళ్లను , ముసలాళ్లను కూడా ఉర్రూతలూగించిన హాట్ భామ విద్యాబాలన్.. అద్భుతమైన ఫ్యామిలీ చిత్రాల్లో నటించి మెప్పించింది.   ఎన్టీయార్ వ్యక్తిగత జీవితంలో అత్యంత ప్రాధాన్యమున్న ‘బసవతారకం’ పాత్రకు విద్యాబాలన్ పూర్తి న్యాయం చేస్తుందని బాలయ్య భావిస్తున్నారు. 

డైరెక్టర్ తేజ విద్యా బాలన్ ను కలవడం, కథ చెప్పడం జరిగింది. కానీ విద్యా మాత్రం బాలయ్య సరసన నటించడానికి నో చెప్పిందనే వార్తలు ఫిలిం సర్కిల్లో వినిపిస్తున్నాయి. డేట్స్ కుదరకనే నో చెప్పిందని అంటున్నారు. ప్రస్తుతం తేజ , వెంకటేష్ తో ఆట నాదే వేట నాదే అనే మూవీ చేస్తున్నాడు. ఇది పూర్తి కాగానే ఎన్టీఆర్ చిత్రాన్ని మొదలు పెట్టాలని చూస్తున్నాడు


మరింత సమాచారం తెలుసుకోండి: