సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ హల్ చల్ చేసే హాట్ బ్యూటీ రాధికా ఆప్టే గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  బోల్డ్ గా మాట్లాడుతూ..ప్రతిసారి కాంట్రవర్సీలు సృష్టిస్తుంది.  రీసెంట్ గా ఓ దక్షిణాది హీరోని తన తొడపై కాలు వేశాడని..వెంటనే అతడి చెంప చెల్లుమనిపించానని చెప్పింది.  ఆ మద్య తన బాయ్ ఫ్రెండ్ తో ఉన్న ఫోటో వైరల్ కావడంతో..అవును బీచ్ లో బికినీలు వేసుకొని తిరుగుతారు..శారీలు వేసుకొని కాదుని సంచలన వ్యాఖ్యలు చేసింది.
Image result for వర్మ రాధికా ఆప్టే
తాజాగా సంచలన దర్శకులు రాంగోపాల్ వర్మపై కూడా ఈ బ్యూట్ హాట్ కామెంట్ చేసింది. బాలీవుడ్‌ నటి నేహా దూపియా నిర్వహిస్తున్న టాక్‌ షో వోగ్ బీఎఫ్‌ఎఫ్‌కు రాధిక ఆప్టే ముఖ్య అతిథిగా వెళ్లింది. ఈ కార్య క్రమం లో మాట్లాడుతూరామ్ గోపాల్ వర్మ ఫై కూడా కామెంట్స్ చేసింది.  రాధికా ఆప్టేను టాలీవుడ్‌కు పరిచయం చేసింది రామ్ గోపాల్ వర్మాయే. ‘రక్త చరిత్ర’ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత ఆమెకు టాలీవుడ్లో వరుసగా అవకాశాలు వచ్చాయి.
Image result for వర్మ రాధికా ఆప్టే
రాధికా ఆప్టే ఇటీవల నేహా దూపియా టాక్ షోలో పాల్గొంది. ‘‘ఏ నటుడు లేదా డైరెక్టర్ రిటైర్ అయితే బాగుంటుందని మీరు భావిస్తున్నారు?’’ అని నేహా దూపియా అడిగిన ప్రశ్నకు రాధికా వెంటనే ‘రామ్ గోపాల్ వర్మ’ అని సమాధానం ఇచ్చింది.దీంతో, రాధికాకు, ఆర్జీవికి మంచి సంబంధాలే ఉన్నాయని సినీ ప్రేక్షకులు ఓ అభిప్రాయానికి వచ్చేశారు. 
Image result for వర్మ రాధికా ఆప్టే
అయితే, ఆర్జీవీ.. తనకు రాధికా ఆప్టే అంటే చాలా ఇష్టమని ఇదివరకే చెప్పారు. శ్రీదేవి తర్వాత అమితంగా ఇష్టపడే హీరోయిన్ ఆమేనన్నారు. ‘‘రాధికా నువ్వు ఇలా ప్రతికారం తీర్చుకుంటుంటే మా లాంటి పేద పురుషులు ఏమైపోవాలి? నా మూడు జన్మల్లో ఇంత హాటైన అందాన్ని నిన్నే చూస్తున్నా’’ అని గతంలో ఆమె ఫోటోలను పోస్ట్ చేసి మరీ ఆర్జీవీ ట్వీట్ చేయడం గమనార్హం. 


మరింత సమాచారం తెలుసుకోండి: