ఫేమస్ అవ్వాలంటే కొందరు తమ టాలెంట్ ను ప్రపంచానికి తెలియజేస్తారు, మరికొందరు వివాదాలను సృష్టిస్తారు. అయితే హీరోయిన్లు ఇందుకు భిన్నం సోషల్ మీడియా వేదికగా తమ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తారు. అలాకాని పక్షంలో కొందరు సంచలన వాఖ్యలు చేస్తారు. గత కొన్ని రోజులుగా నటి శ్రీ రెడ్డి ఇంటర్నెట్లో చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పి సంచలనం సృష్టించింది.


తాజాగా ఇంకో యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె మళ్ళీ బాంబు లాంటి విషయాలను పేల్చింది. హీరోయిన్లు వ్యభిచారం చేస్తే ఎలాంటి తప్పులేదు అని చెప్పింది. పరస్పర సమ్మతితో జరిగే శృంగారాన్ని వ్యభిచారం అని ఎందుకంటారు అని ఆమె ప్రశ్నించింది. పరస్పర శృంగారంలో హీరోయిన్ ఇక్కడ డబ్బు తీసుకుంటుంది. నా దృష్టిలో ఇదేమి తప్పు కాదు. వ్యభిచారం చేస్తే అసలు తప్పు లేదు అని వివాదాస్పద వాఖ్యలు చేసింది.


ఇంతటితో ఆగని ఆమె ప్రేక్షకులను సైతం ఆడుకుంది. హీరోయిన్ల అందాలను ఆస్వాదించడం కోసమే ప్రేక్షకులు సినిమా థియేటర్ కు వస్తారని ఆమె తెలిపింది. వాళ్ళ అందాలను ఊహించుకుంటూ బాత్రూములలో ఏవేవో చేసుకుంటారని తన దృష్టిలో ఇది కూడా వ్యభిచారం తో సమానం అని ఆమె తెలిపింది. ఇలా ప్రతి ఒక్కరు బాత్రూముల్లో వ్యభిచారం చేస్తుంటే హీరోయిన్లు కూడా వ్యభిచారం చేయొచ్చని అదేమీ తప్పుకాదని ఆమె తెలిపింది. ఇలా సంచలనాలు సృష్టిస్తున్న ఆమె ఇంటర్వ్యూ కోసం పలు టీవీ ఛానెల్ కు ఎగబడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: