పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్ ల మధ్య సాన్నిహిత్యం ఉంది అన్న వార్తలు గతంలో అనేకసార్లు వచ్చాయి. టాప్ హీరోయిన్ స్థాయికి ఈమె ఎదగలేక పోయినా ఈమెను ఆంధ్రప్రదేశ్ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ప్రభుత్వం నియమించడంలో పవన్ కళ్యాణ్ రికమండేషన్ ఉంది అన్న గాసిప్పులు చాల సార్లు వచ్చాయి. అలాంటి పూనమ్ లేటెస్ట్ గా చేసిన ట్విట్ లో పవన్ పేరు లేకున్నా అంతర్లీనంగా ఆ ట్విట్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసే విధంగా ఉంది అంటూ పవన్ అభిమానులు తీవ్ర అసహనానికి లోనవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
POONAM KAUR LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
''...కాన్సెప్ట్స్ కాపీ చేసి ... డైలాగ్స్ కాపీ చేసి... బట్టలు మార్చుకుంటూ.. మనసులు మారుస్తూ.. మాట మీద ఉండకపోవటం.. జనాల అమాయకత్వంతో ఆడుకుంటూ.. వేశ భాషలు మారుస్తూ జనాలను మభ్యపెట్టి.. అమ్మాయిలను అడ్డం పెట్టుకుంటు రాజకీయాలు చేస్తున్నారు కొంతమంది.. ఆ భగవంతుడే... నిజం ఎంటో అని తెలిపించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా..'' అంటూ నేటి రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ పూనమ్ ట్విట్ పెట్టింది. 
POONAM KAUR LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈ ట్విట్ కు 83షేర్ లు..185కామెంట్లు, 3.4 కె లైకులు వచ్చాయి. ప్రస్తుతం ఈ ట్విట్ మీడియాకు హాట్ టాపిక్ గా మారడంతో పూనమ్ కౌర్ పెట్టిన ట్విట్ ను చాల ఛానల్స్ బ్రేకింగ్ న్యూస్ గా చూపెడుతున్నాయి. ఈ ట్విట్ పవన్ ప్రస్తావన ఎక్కడా లేకపోయినా పవన్ వ్యతిరేకులు మాత్రం ఈ ట్విట్ పవన్ ను టార్గెట్ చేసిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

పూనమ్ కౌర్ లేటెస్ట్ గా చేసిన ఈ ట్విట్ పై క్లారిటీ లేకపోయినా మొన్న పవన్ తెలుగుదేశ పార్టీని అదేవిధంగా చంద్రబాబును లోకేష్ ను టార్గెట్ చేసిన తరువాత పూనమ్ నుండి ఈ ట్విట్ రావడంతో ఈ ట్విట్ వెనుక ఎవరి ప్రోత్సాహం ఉంది అన్న అనుమానాలు కూడ వ్యక్తం అవుతున్నాయి. పవన్ విమర్శల దాడి పెంచిన తరువాత ప్రశ్నిస్తున్న పవన్ కు విపరీతంగా ప్రశ్నలు ఎదురవ్వడం షాకింగ్ గా మారింది..     


మరింత సమాచారం తెలుసుకోండి: