తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి తమిళ హీరో సూర్య అంటే తెలుగు ప్రేక్షకులకు వల్లమాలిన అభిమానం. అయితే సూర్య తమిళంలో ఏ చిత్రం తీసినా తెలుగు లో ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంటారు.  ఆ మద్య వైజాగ్ లో హుదూద్ తుఫాన్ వచ్చిన అల్లకల్లోలం అయితే..సూర్య వెంటనే స్పందించి ఏపీ గవర్నమెంట్ కి నలభై లక్షలు విరాళంగా ఇచ్చారు. 

ఇలాంటి విరాళాలు, గుప్త దానాలు, సోషల్ యాక్టివిటీస్ ఎన్నో చేస్తున్నారు హీరో సూర్య.  అయితే తన చిత్రాల్లో నటించిన సహనటులకు కూడా ఏ అవసరం ఉన్నా వెంటనే స్పందిస్తారు.   ఒక వైపున నిర్మాతగానూ .. మరో వైపున హీరోగాను సూర్య చకచకా సినిమాలు చేసుకుంటూ వెళుతుంటాడు.  ఇక తనకి సక్సెస్ ను అందించిన దర్శకులకు ఖరీదైన కానుకలను అందజేయడం సూర్యకు మొదటి నుంచి అలవాటు. అలా తాజాగా ఆయన 'సింగం 3' దర్శకుడు 'హరి'కి .. 'తానా సెరిందా కూట్టమ్' దర్శకుడు విఘ్నేష్ శివన్ కి చెరో కారును కానుకగా ఇచ్చాడు. 

2017 లో వచ్చిన ‘సింగం 3’ తమిళ, తెలుగు ఇండస్ట్రీలో ఘన విజయం సాధించింది. కలెక్షన్లు కూడా బాగా సాధించింది. ఇక ఇక ఈ ఏడాది జనవరిలో వచ్చిన 'తానా సెరిందా కూట్టమ్' ఆయనకు హిట్ తెచ్చిపెట్టింది. ఈ కారణంగా ఈ ఇద్దరి దర్శకులకు ఆయన కార్లను కానుగా ఇచ్చి తన పెద్ద మనసును చాటుకున్నాడు. ప్రస్తుతం సెల్వరాఘవన్ తో ఒక సినిమా చేస్తోన్న సూర్య, మరో రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టేశాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: