రంగస్థలం సినిమాలో రంగమ్మ మంగమ్మ అనే పాటపై వివాదం మొదలైన సంగతి తెలిసిందే. పాటలో గొల్లభామ అన్న పేరు యాదవకులాన్ని కించపరిచేలా ఉందని, ఆ పదం తొలగించకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని యాదవహక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు రాములు యాదవ్ డిమాండ్ చేశారు.
Image result for సుకుమార్ క్లారిటీ
వెంటనే గొల్లభామ అనే పదాన్ని తొలగించాలని... లేకపోతే సినిమాను అడ్డుకుంటామంటూ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు రాములు యాదవ్ హెచ్చరించారు. దీనిపై సుకుమార్ స్పందించాడు. గొల్లభామ అనేది కేవలం ఒక పురుగు అని, ఆ పదం పాటలో మనుషుల్ని ఉద్దేశించి రాసింది కాదని ఆయన వివరణ ఇచ్చారు.
Image result for rangasthalam samantha charan
గొల్లభామ అన్న పురుగు అందరికీ తెలిసే ఉంటుందని, పాటలో ఆ పురుగును ఉద్దేశించి రాశామని ఆయన స్పష్టం చేశారు.  కానుంది. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో, మునుపెన్నడూ లేని విధంగా రామ్ చరణ్ కనిపించనుండటంతో, సినీ ప్రేక్షకులందరూ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
Image result for rangasthalam samantha charan rangamma mangamma
రామ్ చరణ్, సమంత జంటగా నటించిన రంగస్థలం సినిమా మార్చి 30న రిలీజ్ కానుంది.  అయితే స్వయంగా సుకుమార్ వివరణ ఇచ్చిన నేపధ్యంలో, ఇక ఈ వివాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పడుతుందని ఆశిద్దాం.సుకుమార్ స్పందనపై యాదవ నేతలు స్పందించాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: