మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో పవన్ కళ్యాన్.  హీరోగా మంచి ఫామ్ లో ఉండగానే సార్వత్రిక ఎన్నికల సమయంలో ‘జనసేన’ అనే పార్టీ స్థాపించారు. మొదట్లో ఆయన స్థాపించిన పార్టీపై ఎన్నో విమర్శలు వచ్చాయి..గతంలో అన్న మెగాస్టార్ చిరంజీవి పార్టీ స్థాపించి కాంగ్రెస్ లో విలీనం చేశారని..ఈయన వచ్చి ఏం ఉద్దరిస్తారని అన్నారు.  అయితే పవన్ కళ్యాన్ పార్టీ స్థాపించినా..పోటీలో మాత్రం నిలబడలేదు.  బీజేపీ, టీడీపీకి మద్దతు ఇచ్చాడు.  ఇక మూడున్నరేళ్లుగా ప్రజల పక్షనా పోరాడుతున్నారు. 
Image result for pawan kalyan speech guntur
2019 ఎలక్షన్లో పవన్ కళ్యాన్ ప్రత్యక్షపోటీకి సిద్దం కావడంతో..ఇప్పటి నుంచి ప్రచారం చేయడం మొదలు పెట్టారు.  అంతే కాదు ఏపికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నారు.  గుంటూరు లో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. పవన్ వ్యాఖ్యలను తప్పుబడుతూ చంద్రబాబు, లోకేశ్ సహా టీడీపీ నేతలు మండిపడుతున్న తరుణంలో హీరో రామ్ చరణ్ ఓ పోస్ట్ చేశాడు.
Image result for pawan kalyan speech guntur
అందరికీ స్ఫూర్తినిచ్చేలా, నిజాయితీగా చాలా గొప్పగా ఉంది బాబాయ్ స్పీచ్’.. అంటూ జనసేనకు జై కొట్టారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. బుధవారం నాడు (నిన్న) జరిగిన ‘జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ’లో పవన్ కళ్యాణ్ ప్రసంగంపై ట్విట్టర్ వేదికగా ప్రసంశలు కురిపించారు చెర్రీ.ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ఎండగడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై స్వరం పెంచారు.
Image result for janasena avirbhava sabha guntur
ఎవరూ ఊహించని రీతిలో విమర్శలు, ఆరోపణలు, చురకలు, హెచ్చరికలతో వాడివేడిగా సాగిన పవన్ ప్రసంగంపై ఒకవైపు టీడీపీ ఫైర్ అవుతుంటే... మా బాబాయ్ స్పీచ్ సూపర్ అంటూ అబ్బాయ్ రామ్ చరణ్ ట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది.కాగా, ఈ పోస్ట్ పై నెటిజన్లు భిన్న వ్యాఖ్యలు చేశారు. ‘నిజం చెప్పాలంటే మొట్టమొదటసారిగా పీకే హృదయపూర్వకంగా మాట్లాడారు. బాగా అనిపించింది’, ‘నువ్వు సినిమాలపై ఏకాగ్రత పెట్టు అంటున్నారు నెటిజన్లు.



మరింత సమాచారం తెలుసుకోండి: