శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీడేస్’‌ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నిఖిల్. అయితే ఆ సినిమా తర్వాత వరుస ఫ్లాపులతో డీలా పడిన ఈ హీరో ‘స్వామి రారా’తో అనూహ్యంగా హిట్ ట్రాక్ ఎక్కాడు.  అప్పటి నుంచి తాను ఎంచుకునే కథలు పూర్తిగా వైవిధ్యభరితంగా ఉండేలా చూసుకుంటున్నాడు..అదృష్టం కొద్ది ఆ సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. 
Image result for kirrak party
 ‘కార్తికేయ’, ‘సూర్య వర్సస్ సూర్య’, ‘శంకరాభరణం’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘కేశవ’ వంటి వెరైటీ సినిమాలు చేసి ప్రేక్షకుల మన్ననలు పొందాడు. ఇప్పుడు ‘కిరాక్ పార్టీ’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  కేశవ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు నిఖిల్. ఇంజినీరింగ్ క్యాంపస్, సీనియర్స్ జూనియర్స్ గొడవలు, ప్రేమ వంటి అంశాలు కలగలిపిన కథ ఇది. కన్నడలో ‘కిరిక్ పార్టీ’గా సూపర్ హిట్ కావడంతో తెలుగులో ‘కిరాక్ పార్టీ’గా రీమేక్ చేశారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం, అనిల్ నిర్మించిన ఈ చిత్రానకి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. 
Related image
 నేడు కిరాక్ పార్టీతో పాటు తెలుగులో విడుదల అయిన సినిమాలు నయనతార ‘కర్తవ్యం’, ‘దండుపాళ్యం 3’, ‘ఐతే 2.0’. వీటిల్లో నయనతార సినిమాకు ప్రమోషన్ అయితే బాగానే చేస్తున్నారు. నిఖిల్‌కి ఇది 15వ చిత్రం. నిఖిల్ సరసన సిమ్రన్ పర్జీనా, సంయుక్త హెగ్డే నటించారు. ఈ సినిమాకి ప్రముఖ దర్శకులు సుధీర్ వర్మ స్ర్రీన్ ప్లేనీ, మరో దర్శకుడు చందూ మొండేటి సంభాషణలు అందిచడం విశేషం. 

ఓవరాల్ గా చూస్తే.. బాక్సాఫీస్ వద్ద సమ్మర్ హీట్ ఇప్పుడే మొదలైంది. తొలి ఛాన్స్ నిఖిల్ కే దక్కుతోంది. ఇది స్టూడెంట్స్ ను టార్గెట్ చేసిన సినిమా. తన ప్రమోషన్లో కూడా స్టూడెంట్స్ ని బాగా టార్గెట్ చేశాడు నిఖిల్. ఇప్పటికే విదేశాల్లో ఈ సినిమాను చూసినవారు, ఇక్కడ ప్రీమియర్ షోలకు వెళ్లినవారు ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు.

ఫస్టాఫ్ బాగుంది కానీ.. సెకండ్ హాఫ్‌ను మాత్రం బాగా సాగదీశారని టాక్ వినిపిస్తుంది. మరో వైపు యావరేజ్.. బిలోవ్ యావరేజ్ సినిమా అని మరికొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిఖిల్ మాత్రం అద్భుతంగా నటించాడని అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: