తను తీసే సినిమాలలో  సృజనాత్మకతను ఎక్కువ చూపించే దర్శకుడు సుకుమార్ సినిమాలను చాలా ఆలస్యంగా తీస్తూ ఉంటాడు. దీనికితోడు ఈ క్రియేటివ్ దర్శకుడు తీసే సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా మారకపోయినా ఇతడి సినిమాలలో నటించడానికి టాప్ హీరోలు అందరు ఆసక్తి కనపరుస్తూనే ఉంటారు. దీనికికారణం సుకుమార్ తీసే ప్రతిసినిమాలోను ఏదో ఒక విశేషం ఉంటూనే ఉంటుంది. 
RANGASTHALAM MOVIE MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ప్రస్తుతం సుకుమార్ రామ్ చరణ్ తో చేసిన ‘రంగస్థలం’  మూవీ 1980 కాలంనాటి సినిమా అన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు స్టైలిష్ సినిమాలు తీస్తూ వచ్చిన సుకుమార్ ఒక్కసారిగా ఇలాంటి భిన్నమైన సినిమా తీయడం వెనుక ఒక అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సలహా ఉంది అని అంటున్నారు. ఈ విషయాని స్వయంగా సుకుమార్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. 
DIRECTOR SUKUMAR LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
‘నేను 28 ఏళ్ల వరకు పల్లెటూరిలోనే ఉన్నాను. సినిమాల్లోకి వచ్చాక విదేశాలంటూ తిరిగుతున్నాను. నాగత సినిమాలు ‘వన్ నేనొక్కడినే’, ‘నాన్నకు ప్రేమతో’ ఎక్కువగా విదేశాల్లోనే షూట్ చేశాం. ఆ సమయంలో ఒక వ్యక్తి నాదగ్గరకొచ్చి సర్ మీరు సినిమాలు చాలాబాగా తీస్తున్నారు. కానీ మన తెలుగు నేపథ్యంలో ఎందుకు తీయడంలేదు’ అని అడిగిన మాటకు తనకు సిగ్గు వేసింది’ అని కామెంట్ చేసాడు.  దీనితో తనను ఆ ప్రశ్న అడిగిన వ్యక్తికి సమాధానంగానే ‘రంగస్థలం’ చేశాను అని అంటున్నాడు. 
ప్రతి పల్లెటూరు నాటకరంగంలానే ఉంటుంది. అక్కడ రకరకాల మనుషులు, పాత్రలు ఉంటాయి. అందుకే అన్ని పల్లెటూళ్లను కలిపేలా ‘రంగస్థలం’ అని పేరుపెట్టిన విషయాన్ని వివరించాడు సుకుమార్. 
RANGASTHALAM MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈనెల 18 ఉగాది పండుగరోజున విజయవాడలో జరగబోయే ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను చాలా డిఫెరెంట్ గా జరపడానికి సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. తెలుస్తున్న సమాచాం మేరకు ఈఫంక్ష‌న్ లో ఒక పాటను చంద్ర‌బోస్ స్వ‌యంగా పాడి వినిపించ‌బోతున్నాడు. చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్న ఈఫంక్షన్ కు మెగా ఫ్యామిలీతో అనుబంధం ఉన్న చాలమంది దర్శకులు ఈ ఫంక్షన్ కు హాజరు అవబోతున్నట్లు టాక్ హాజ‌ర‌వుతాడు. దేవిశ్రీ ప్ర‌సాద్ లైవ్ షో ఈకార్యక్రమానికి ఒక హైలెట్ అయితే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన అనేక జానపద కళారూపాల ప్రదర్శన కూడ మరో హైలెట్ గా మారబోతోంది. చరణ్ కెరియర్ లో ఇప్పటివరకు ఎప్పుడు రాని భారీ ఓపెనింగ్స్ ఈసినిమాకు వచ్చేలా అత్యంత భారీ స్థాయిలో ఈమూవీ ప్రమోషన్ కు వ్యూహాలు రచిస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: