హీరోయిన్ రాధిక ఆప్టే గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తను ఏ స్టేట్మెంట్ ఇచ్చిన చాలా బోల్డ్ గా ఉంటుంది. మరియు స్క్రీన్ మీద చాలా బోల్డ్ గా కనిపించడానికి వెనుకాడదు. అయితే తన భర్తను కలవాడానికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెబుతుంది. భర్తతో గడపడానికి ఖర్చవ్వడం ఏమిటి? అంటే.. ఇందులో హీరోయిన్ చమత్కారం కొంత ఉంది. భర్తను కలవడానికి ఆమె చాలా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోందట.

Image result for radhika apte

ఇందులో ద్వంద్వార్థం ఏమీ లేదు. సింగిల్ మీనింగే. ఎందుకంటే.. రాధికా ఆప్తే భర్త బెనెడిక్ట్ టేలర్ ఒక బ్రిటిష్ వాడు. అతడు కంపోజర్. బ్రిటన్ లోనే ఉంటాడు. అతడిని కలవడానికి రాధికే అప్పుడప్పుడు వెళ్తూ ఉంటుందట. బ్రిటన్ కు వెళ్లడం అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కదా. నెలకు ఒకటీ రెండు సార్లు తను బ్రిటన్ వెళ్తూ ఉంటాను అని, దీంతో డబ్బులు చాలా ఖర్చు అవుతోందని రాధిక చెబుతోంది.
Image result for radhika apte
దీంతో తను ఎక్కువగా విమానంలో ఎకనామిక్ క్లాస్ లోనే ఎక్కువగా ప్రయాణిస్తూ ఉంటానని రాధిక చెబుతోంది. ఈ విషయాన్ని ఫ్లైట్ లో తనతో చాలా మంది అడుగుతారని.. నటివయ్యుండి ఎందుకు బిజినెస్ క్లాస్ లో వెళ్లడం  లేదు.. సాధారణ క్లాస్ లో ఎందుకు వెళ్తున్నావు? అని అడుగుతారని, ఎక్కువ ప్రయాణం చేయడంతో ఖర్చును తగ్గించుకోవడానికే తను ఇలా చేస్తున్నాను అని రాధిక మీడియా ముఖంగా వివరించింది. ఒక్కోసారి అప్పటికప్పుడు టికెట్స్ బుక్ చేసుకోవాల్సి వస్తుందని.. ఓవరాల్ గా భర్తతో కాపురం తనకు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అవుతోందని రాధిక చెప్పింది.


మరింత సమాచారం తెలుసుకోండి: