బాలీవుడ్ కండల వీరుడు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సల్మాన్ ఖాన్ అంటే తెలియని వారు ఉండరు. ఎంత గొప్ప సినీమా నటుడు అయినా..ఎన్నో వివాదాలకు కేంద్ర బింధువు సల్మాన్.  తాజాగా సల్మాన్ ఖాన్ తన భర్త అంటే ఓ యువతి చేసిన హంగామా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  ముంబైలోని బాంద్రా ప్రాంతంలో సల్మాన్ నివసించే గెలాక్సీ అపార్ట్ మెంట్ లో ఇటీవల ఈ సంఘటన జరిగింది. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది కంటపడకుండా అపార్ట్ మెంట్ పైభాగానికి ఆ యువతి చేరుకుంది.
Image result for సల్మాన్ ఖాన్
సల్మాన్ తన భర్త అంటూ కేకలు వేయడంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది, వెంటనే అక్కడికి చేరుకున్నారు.అక్కడికి వెళ్లి యువతిని కిందకు దింపే ప్రయత్నం చేశారట.  యువతి మాత్రం సెక్యూరిటీ సిబ్బందికి చుక్కలు చూపించిందట. ఆమె తన వెంట రాడ్లతో బెదిరింపులకు దిగింది. దగ్గరికి వస్తే పొడచుకుని చనిపోతానంటూ హెచ్చరించింది. ఇక చేసేదేం లేక ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా... వారు స్పాట్‌కు వచ్చారు. మొత్తానికి ఆ యువతికి  సర్థిచెప్పి మెల్లిగా కిందకు దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారట.
Image result for salman khan galaxy house
గతంలో కూడా పలు మార్లు ఫ్యాన్స్ ఇదే విధంగా సల్మాన్ ఇంటి ముందు తెగ హడావిడి చేయడం జరిగింది.  ఈ మద్య సల్మాన్ ఖాన్ పై ఎటాక్ చేస్తామని, చంపుతామని ఓ రౌడీ షీటర్ బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. అంతే కాదు రేస్ 3 షూటింగ్ సమయంలో కొంత మంది అగంతకులు సల్మాన్ షూటింగ్ స్పాట్ కి రావడంతో వెంటనే సల్మాన్ ఖాన్ ని సెక్యూరిటీతో అతని ఇంటికి పంపించారు.
Image result for race 3 salman khan
ఈ నేపథ్యంలో యువతి చేసి హంగామాతో సెక్యూరిటీ మరింత అప్పమత్తం అయ్యింది. ఆమె ఎవరో ఆరా తీసి బంధువులకు అప్పగించినట్లు తెలుస్తోంది.సల్మాన్ నటిస్తున్న ‘రేస్ 3’ సినిమా ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ అబుదాబిలో జరుగుతోంది. షూటింగ్ నిమిత్తం సల్మాన్ అబుదాబిలో ఉన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: