హాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎన్నో యాక్షన్ చిత్రాలు వచ్చాయి..అయితే ‘ఎవెంజర్స్‌ ’ పేరు తో వచ్చిన చిత్రాలకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.  ఇప్పటి వరకు ఈ సీరిస్ తో వచ్చిన సినిమాలకు భారీ కలెక్షన్లు కూడా వసూళ్లు చేశాయి.  కొంత కాలంగా హీలీవుడ్ చిత్రాలు భారత్ లో కూడా భారీగా లాభాలు తెచ్చిపెడుతున్నాయి. 
Image result for avengers mean
ఇక సమ్మర్ సీజన్ లో మరో అద్భుతం సృష్టించబోతుంది..‘ఎవెంజర్స్‌ - ఇన్‌ఫినిటీ వార్‌ ’.  అత్యంత శక్తిమంతమైన శత్రువును ఎదుర్కొనేందుకు ఐరన్‌ మ్యాన్‌, థోర్‌,  స్పైడర్ మాన్, ఎవెంజర్స్‌ అందరూ ఒక్కటయ్యారు. విశ్వాన్ని తన అదుపు ఆజ్ఞల్లోకి తెచ్చుకునేందుకు అవసరమైన ఇన్‌ఫినిటీ స్టోన్స్‌ను సేకరించేందుకు ప్రయత్నిస్తున్న ఈవిల్‌ థానోస్‌ను అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు.
Image result for avengers mean
తాజాగా ఈ మూవీ న్యూ ట్రైలర్‌ను మార్వెల్‌ విడుదల చేసింది. ఇప్పటికే విడుదల చేసిన ఒక ట్రైలర్‌ అలరించగా, దానిని మించేలా ఈ ట్రైలర్‌ ఉండటం గమనార్హం. సూపర్‌ హీరోలందరూ థానోస్‌ను ఎదుర్కోవడమే ఈ చిత్రంలో ప్రధానాంశంగా చూపించబోతున్నారు. మార్వెల్‌ స్టూడియోస్‌ చరిత్రలోనే భారీ చిత్రంగా రూపుదిద్దుకున్న ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్‌’పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఎందుకంటే ‘అవెంజర్స్‌’, ‘ది గార్డియన్‌ ఆఫ్‌ ది గెలాక్సీ’ వంటి చిత్రాల్లో నటించిన సూపర్‌ హీరోలందరూ ఇందులో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఆంథోని రస్సో, జోయ్‌ రస్సోలు దర్శకత్వం వహిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: