టాలీవుడ్ లో హీరోయిన్స్ మధ్య పోటీ పోటెత్తుతోంది. ఇప్పటికే నివేద థామస్, అనుపమ సందడి చేస్తే... రకుల్ మాత్రం స్టార్ హీరోయిన్ గా ట్రెండింగ్ లో ఉంది. మరి సడన్ గా జోష్ పెంచిన పూజా దెబ్బతో ఎవరి ప్లేస్ కి రీప్లేస్ దొరికింది. ప్రజంట్ వచ్చే సీజన్ లో టాలీవుడ్ టాప్ చైర్ లో సిట్ అయ్యే ఛాన్స్ ఎవరికి దక్కబోతుంది.

Image result for rakul and pooja hegde

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ప్లేస్ కోసం ప్రజెంట్ పోటీ పోటెత్తుతోంది. మొన్నటి వరకు టాప్ లీగ్ లో పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సందడి చేసింది. టాప్ హీరోలందరి సినిమాలకు సింగిల్ ఛాయిస్ గా ఉండేది. బోలెడంత గ్లామర్.. కాస్త టాలెంట్ ఉండటంతో రకుల్ హవా కొనసాగింది. కానీ ప్రజంట్ సీన్ మారింది. కొత్త బ్యూటీ దెబ్బకి తన అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితి కనిపిస్తుంది.

Image result for rakul and pooja hegde

రకుల్ స్పీడుకు బ్రేకులేస్తూ దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో కన్నడ భామ పూజా హెగ్డే అందరి దృష్టిని అట్రాక్ట్ చేస్తోంది. అంతకుముందు రెండు తెలుగు సినిమాలు చేసినా ఆమెలో ఉన్న గ్లామర్ యాంగిల్ పెద్దగా పట్టించుకోలేదు. దువ్వాడ జగన్నాథమ్ లో అమ్మడు చూపించిన బికినీ సోకులు చూశాక టాలీవుడ్ ఫోకస్ పూజాపై పడింది. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా చేసే మూవీతోపాటు సాహో తరవాత ప్రభాస్ పక్కన.. భరత్ అనే నేను తరవాత మహేష్ చేసే సినిమాలో పూజాయే హీరోయిన్ గా ఎంపికైంది. ఇవన్నీ పెద్ద ప్రాజెక్టులే. వీటిలో నటించేందుకు ఆమె భారీ మొత్తమే డిమాండ్ చేసింది. మరి ఈ 3 సినిమాల్లో ఏ రెండు హిట్ అయినా పూజాకి టాప్ ప్లేస్ ఖాయం.

Image result for rakul and pooja hegde

పూజా క్రేజ్ పెరగడంతో రకుల్ కథ తెలుగులో కంచికి చేరింది. అయితే తన డైరీయేం ఖాళీగా లేదు. ఆమె హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ సినిమా అయ్యారీ ఈ మధ్యనే రిలీజై సందడి చేసింది. దీంతో మరో బాలీవుడ్ మూవీ చేసే ఛాన్స్ దక్కింది. దీంతోపాటు తమిళంలో పెద్ద హీరోలైన సూర్య, కార్తీ ఇద్దరి సినిమాల్లో రకుల్ నే హీరోయిన్ గా తీసుకున్నారు. మొత్తానికి తెలుగులో రకుల్ ప్లేస్ ని పూజా రీప్లేస్ చేసే ఛాన్స్ ఉంది. అదే జరిగితే నెక్స్ట్ సీజన్ నుంచి తన సందడి షురూ కావడం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: