ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రక్రియాశీలక రాజకీయాలలో ఒక శక్తిగా ఎదగాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ నిన్నసాయంత్రం విజయవాడ నుండి ప్రసారాలు చేస్తున్న ఒక ప్రముఖ ఛానెల్ ఆఫీస్ కు వచ్చాడు. దీనితో ఆ ఛానెల్ పవన్ రాక సందర్భంగా భారీ ఏర్పాట్లు చేసి ఆకార్యక్రమాన్ని అంతా లైవ్ లో ప్రసారం చేసారు. 
PAVAN KALYAN AT AP 24 CHANEL OFFICE PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈసందర్భంగా ఆ ఛానెల్ న్యూస్ హెడ్ పవన్ తో లైవ్ ఇంటర్వ్యూ చేయాలని ప్రయత్నిస్తే పవన్ తీవ్ర అసౌకార్యానికి గురి కావడమే కాకుండా ఆ ఛానెల్ న్యూస్ హెడ్ అడిగిన ఏప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా అతిత్వరగా ఆకార్యక్రమాన్ని ముగించాడు. దీనితో ఈ విషయం పై పవన్ ను టార్గెట్ చేస్తూ కత్తి మహేష్ తన ట్విటర్ లో పోస్ట్ చేసిన కామెంట్ ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. 
KATTI MAHESH LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
‘నేను ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అయిరాలేదు ప్రిపేర్డుగా లేను అనే బేలమాటలు, సిగ్గరి చూపుల, నోరు లేపలేని సణుగుడు, గొణుగుడులు ఏమిటి పవన్ కల్యాణ్ ! బీ ఏ మ్యాన్. లేదంటే మంచి వక్తలను అయినా నియమించుకో కల్యాణ్ దిలీప్ సుంకరవంటి వారు ఉన్నారు కదా" అని మహేష్ కత్తి  తన కామెంట్ ను పోస్ట్ చేసాడు. 
PAVAN LATEST MEDIA MEET PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇది ఇలా ఉండగా రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు ఒకే లక్ష్యంతో ఒకే మార్గంలో ఉద్యమిస్తు కేంద్ర ప్రభుత్యం పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపధ్యంలో వారి ప్రయత్నాల  ద్వారా ప్రత్యేక హోదా వచ్చేస్తే తన పార్టీ పరిస్థితి ఏమిటి అని పవన్ తెగ మధన పడిపోతున్న నేపధ్యంలో పవన్ లోని అసహనం మరింత పెరిగిపోయింది అన్న వార్తలు  వస్తున్నాయి. ఇప్పుడు ఈ అవిశ్వాస తీర్మానం విషయం గంటకు ఒక మలుపు తిరుగుతున్న నేపధ్యంలో తాను ఎంతో ఆలోచనలు చేసి వేసిన ఎత్తుగడలు అన్నీ వృథ అయిపోతాయా అన్న భయం ప్రస్తుతం పవన్ ను విపరీతంగా వెంటాడుతున్నట్లు టాక్. 
 
Kathi Mahesh‏ @kathimahesh
FollowFollow @kathimahesh
More
ఒక టివి ఛానల్లో కూర్చుని, "నేను ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అయ్యి రాలేదు. ప్రిపేర్డ్ గా లేను" అనే బేల మాటలు. సిగ్గరి చూపులు. నోరు లేపలేని సణుగుడు, గొణుగుడులు ఏమిటి పవన్ కళ్యాణ్! Be a man !! Or at least hire some good spokespersons. There are people like #KalyanDileepSunkara.


మరింత సమాచారం తెలుసుకోండి: