సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు మొదట మోడలింగ్ చేసి వచ్చిన వారే..ఐశ్వర్యారాయ్, దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రా ఇలా టాప్ హీరోయిన్లు కెరీర్ బిగినింగ్ లో మోడలింగ్ చేసిన వారు.  అదృష్టం కలిసి వచ్చి హీరోయిన్లు గా రాణించేవారు కొంత మంది అయితే..మద్యలోనే కెరీర్ కి పులిస్టాప్ పెట్టిన వారు చాలా మంది ఉన్నారు. 
Related image
తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీలు మొదట్లో మోడలింగ్ చేసి వచ్చినవారే..రకూల్ ప్రీత్ సింగ్, రాశీ ఖన్నా లు కూడా మోడలింగ్ నుంచి హీరోయిన్లు గా మారిన వారే కావడం విశేషం.  బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా చెప్పుకొనే బిపాసాబసు మొదట మోడలింగ్ లో రాణించి ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 
Related image
అయితే సినీరంగ ప్రవేశం చేసిన ఆమెకు ఆరంభంలో మంచి అవకాశాలే వచ్చాయి. ఆరంభంలో మంచి అవకాశాలు దక్కించుకున్న బిపాసా, హర్మాన్ బవేజా, డినో మోరియా, జాన్ అబ్రహాం, క్రిస్టియానో రొనాల్డోలతో రొమాన్స్ సాగించి, కరణ్ సింగ్ గ్రోవర్ ను వివాహం చేసుకుంది. వివాహానంతరం అవకాశాలు పూర్తిగా తగ్గడంతో మళ్లీ మోడల్‌ గా మారింది.
Related image
తాజాగా ఢిల్లీలో డిజైనర్ షోలో పాల్గొన్న బిపాసా, తాను మళ్లీ మోడల్ గా మారానని, మోడలింగ్ గొప్ప వృత్తి అని పేర్కొంది. సవాలుగా మారిన మోడలింగ్ లో ఆరోగ్యంతో పాటు ఫిట్ నెస్ కాపాడుకుంటూ మోడల్ గా కొనసాగుతానని బిపాసా తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: