తెలుగు ఇండస్ట్రీలో ధృవ చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకొని సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ చిత్రంలో నటిస్తున్నాడు రాంచరణ్. ఈ చిత్రం వాస్తవానికి సంక్రాంతికే రావాల్సి ఉన్నా..కొన్ని సీన్లు బాగా రావాలని రీ షూట్ చేసినట్లు ఆ మద్య వార్తలు వచ్చాయి. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్, సాంగ్స్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి.
Related image
తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన రాంచరణ్...మిమ్మ‌ల్ని అంద‌ర్నీ చూస్తుంటే నాకు నా కాలేజ్ డేస్ గుర్తుకొస్తున్నాయి. మీ అంద‌ర్నీ ఇలా క‌ల‌వ‌డం చాలా సంతోషంగా ఉంది.  ఈనెల‌లో నాకిది బెస్ట్ డే.  ఇక్క‌డ ఉద్యోగులే వర్య్చూస్ ను ఈ స్థాయిలో నిల‌బెట్టార‌నిపిస్తోంది.  వర్చ్యూస్ లో  ప‌నిచేస్తోన్న చాలా మంది ఉద్యోగులు ర‌క్త‌దానం చేశారు. చాలా మంచి సేవా కార్య‌క్ర‌మం అది. మేము త‌ల‌పెట్టిన ఆ కార్య‌క్ర‌మానికి ఇంత‌మంది ఎంతో బాధ్య‌త తీసుకుని చేస్తున్నంద‌ుకు చాలా గ‌ర్వంగా ఉంది.


డాన్స్, పాట‌ల ప్ర‌ద‌ర్శ‌న చాలా బాగుంది. హ‌రిత `రంగ‌మ్మ మంగ‌మ్మ` పాటను ఒరిజిన‌ల్ సింగ‌ర్ క‌న్నా బాగా పాడారు. ఇక రంగ‌స్థ‌లం సినిమా కోసం ఏడాది పాటు క‌ష్ట‌ప‌డ్డాను. గుబురు గెబ్బం... మీసం తోనే ఉన్నారు.రంగ‌స్థ‌లం సినిమా అద్భుతంగా వ‌చ్చింది. "ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాం .. ఎవరూ నిరుత్సాహ పడకుండగా జాగ్రత్తలు తీసుకున్నాం.
Image result for rangasthalam 1985
ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని గట్టిగా చెప్పగలను. ఇంతవరకూ నా కెరియర్లో చేసిన సినిమాల్లో ఇదే బెస్ట్ మూవీ అని చెప్పగలను. నటన పరంగా కూడా నాకు బాగా సంతృప్తిని కలిగించిన పాత్ర ఇది. 

ఈ సినిమా నాకొక కొత్త అనుభూతినిచ్చింది. నా గ‌త సినిమాలు మిస్ అయినా...ఈ సినిమా మాత్రం త‌ప్ప‌కుండా అంద‌రూ చూడండి. అంద‌రికీ క‌చ్ఛితంగా న‌చ్చుతుంది` అని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో వ‌ర్చ్యూస్ యాజ‌మ‌న్యం, ఉద్యోగులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: