టాప్ హీరోల రేస్ లో చాలముందు వరసలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ నటన డాన్స్ లతో పాటు మంచి వాక్ చాతుర్యం కూడా ఉన్న సెలెబ్రెటీ. సినిమాల్లోనే కాకుండా రాజకీయ ప్రసంగాలను  సైతం ఎన్టీఆర్  చాలా అద్భుతంగా చేయగలడు. నందమూరి బాలకృష్ణ ఉపన్యాసాల కంటే జూనియర్ ఉపన్యాసాలు బాగుంటాయని తెలుగుదేశ పార్టీ అభి మానులు ఓపెన్ గానే చెపుతూ ఉంటారు. 
JUNIOR NTR LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
2009 ఎన్నికలో ఎన్టీఆర్ టీడీపీ తరపున ప్రచారం ఒక ఉప్పెనలా ఆ ప్రచారాన్ని నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఆతరువాత జరిగిన పరిణామాలలో నెమ్మదిగా   జూనియర్ తెలుగుదేశం పార్టీకి దూరమై ప్రస్తుతం సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యాడు. లేటెస్ట్ గా పవన్ తన రాజకీయ ఎత్తుగడల వేగం పెంచి తన మాటలతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును కార్నర్ చేస్తున్న నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులైన కొందరు ప్రముఖులు లేటెస్ట్ గా జూనియర్ ను కలిసినట్లు టాక్. 
JUNIOR NTR LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ప్రస్తుత పరిస్థుతులలో జూనియర్ తనపంతాలు వీడి తెలుగుదేశం పార్టీ పై జరుగుతున్న దాడిని తిప్పి కొట్టడానికి తన వంతు సహకారం కూడ ఇవ్వవలసిందిగా జూనియర్ ను కోరినట్లు తెలుస్తోంది. అంతేకాదు పవన్ చేస్తున్న కామెంట్స్ కు సమాధానంగా కనీసం ఒక ట్విట్ ను అయినా చేయమని కోరినట్లు టాక్. 
టిడిపి నుంచి ఎన్టీఆర్ కు పిలుపు
అయితే ఈ సూచనలకు జూనియర్ సున్నితంగా తిరస్కరిస్తూ ప్రస్తుతం తన దృష్టి అంతా త్రివిక్రమ్ రాజమౌళిలతో నటించబోతున్న సినిమాల పై ఉందని మరో రెండు సంవత్సరాల వరకు తనకు సినిమాలు తప్ప మరో ప్రపంచం లేదు అంటూ వ్యూహాత్మకంగా తప్పించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తన తాత నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ ముప్పేట దాడి జరుగుతున్న నేపధ్యంలో కనీసం జూనియర్ తెలుగుదేశం పార్టీ కోసం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కోసం ఒక ట్విట్ కూడ పెట్టకపోతే జూనియర్ వ్యూహాత్మకమైన తప్పు చేసినట్లే అవుతుందని నందమూరి అభిమానులు చాలామంది భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: