ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా మీద ఇప్పటికే అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వం లో ఎన్టీఆర్ చేస్తున్న మొట్ట మొదటి సినిమా ఇది. అయితే ఈ సినిమా బడ్జెట్ వింటుంటే మైండ్ బ్లాక్ అవుతుంది. సుమారుగా వంద కోట్ల కు చేరుకోనున్నది అని అందరు అనుకుంటున్నారు. ఈ సినిమాకు కాస్టింగ్ కే యాభైకోట్ల వరకు అవుతుందని, ఆపైన టెక్నికల్ టీమ్ కు మరో అయిదుకోట్ల వరకు అవుతుందని అంచనా వేస్తున్నారు.
Image result for ntr and trivikram
ఎన్టీఆర్-త్రివిక్రమ్ కలిసే 40వరకు బిల్లింగ్ వుంటుందని అంచనా. ప్రొడక్షన్ కాస్ట్ ఎలా లేదన్నా ముఫైకి పైగా వుంటుందని లెక్కలు వేస్తున్నారు. దాంతో అంతా కలిపి  90 వరకు డేకుతుంది. ఇక వడ్డీలు, పబ్లిసిటీ అన్నీ కలిపి మరో పది. టోటల్ గా వందకోట్ల సినిమా అవుతుందట. ఏప్రియల్ లో ప్రారంభమయ్యే ఈ సినిమాకు హీరో హీరోయిన్లు కాకుండా ఇప్పటికి జగపతి బాబును ఎంపిక చేసారు.
Image result for ntr and trivikram
మిగిలిన కాస్టింగ్ పై చర్చలు సాగుతున్నాయి. ఏప్రియల్ లో ప్రారంభమయ్యే ఈ సినిమాను ఎలాగైనా అక్టోబర్ నాటికి రెడీ చేయాలని సంకల్పం. ఎందుకుంటే, సంక్రాంతికి బాలయ్య ఎన్టీఆర్ సినిమా  వుంటుంది కనుక. కానీ ఆ లోపు పూర్తయ్యే అవకాశాలు చాలా తక్కువ అని తెలుస్తోంది. త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా కోసం చిరకాలంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. అంచనాలు ఏమాత్రం తగ్గ కూడదు. పైగా అజ్ఞాతవాసితో దర్శకుడు త్రివిక్రమ్ తొలిసారి పరాజయాన్ని చవిచూసారు. అందువల్ల ఆయన ఎలాగైనా హిట్ కొట్టి తీరాలి. అందువల్ల చకచకా చుట్టేయడానికి వీలు కాదు. కాస్త ముందు వెనుక చూసుకుంటూ  వెళ్లాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: