స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే వరుసుగా ఆఫర్లు చేజిక్కుచ్చుకున్నది. తను నాటించ బోయే సినిమాలన్నీ స్టార్ హీరోస్ సినిమాలు. అక్కడే ఈ బ్యూటీ కి సవాలు ఎదురౌతున్నాయి. రంగ‌స్థ‌లంలో ఆమె న‌టించిన స్పెష‌ల్ సాంగ్ ఓ ఇన్‌స్టెంట్ బ్లాక్ కాఫీలా ఉంటుంద‌ట‌. చూసే వాళ్ల‌కు త‌క్ష‌ణం ఎనర్జీని ఇస్తుంద‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా చెప్పింది పూజా హెగ్డే.
Image result for pujaa hegde
దాంతో పాటు భ‌విష్య‌త్తులో చేయ‌బోయే ప్రాజెక్టుల గురించి కూడా  ఉప్పందించింది. త‌న ముందు ప్ర‌స్తుతం ఉన్న టాస్క్ ల‌ను వివ‌రించింది. మ‌హేష్‌బాబు ఎంత అంద‌గాడో తెలిసిందే.. ఆయ‌న ప‌క్క‌న అంతే అందంగా క‌నిపించ‌డం మొద‌టి టాస్క్. ఎన్టీఆర్ ప‌క్క‌న డ్యాన్సులు  చేయ‌డ‌మంటే సవాలే. అంత‌క‌న్నా పెద్ద స‌వాలు.. ఆయ‌న‌తో సింగిల్ టేక్‌లో డైలాగులు చెప్పి ఓకే చేయించ‌డం.. అదీ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ సినిమాలో. ఉన్న‌వాటి అన్నిటిలోకీ అత్యంత పెద్ద టాస్క్ ఇదే.
Image result for pujaa hegde
పైగా ఈ టాస్క్ కీ, ఫ్యామిలీకి సంబంధం ఉంది.. త్రివిక్ర‌మ్ సినిమాలంటే పూజా తండ్రికి చాలా ఇష్టం. `అత్తారింటికి దారేది` చిత్రాన్ని ఆయ‌న ఇప్ప‌టికే కొన్ని వంద‌ల సార్లు చూశారు. సో ఇది కాస్త ఎమోష‌న‌ల్  టాస్క్ అన్న‌మాట‌. ముచ్చ‌ట‌గా మూడో టాస్క్ ప్ర‌భాస్‌కి సంబంధించింది. `బాహుబ‌లి`తో పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్ర‌భాస్ ప‌క్క‌న అంతే హుందాగా, లావ‌ణ్యంగా న‌టించడం అంత తేలికైన ప‌ని మాత్రం కాదు. సో ఇన్ని టాస్క్ లూ, ఇన్ని గోల్స్ మ‌ధ్య ఉక్కిరిబిక్కిరి అవుతోంది పూజా హెగ్డే. 


మరింత సమాచారం తెలుసుకోండి: