మాస్ మహరాజుగా పేరు తెచ్చుకున్న రవితేజ రెండు సంవత్సరాలు టైమ్ గ్యాప్ తీసుకొని ‘రాజా ది గ్రేట్’ సినిమాతో అద్భుతమైన విజయం అందుకున్నాడు.  ఈ సినిమా తర్వాత టచ్ చేసి చూడు సినిమాతో అనుకున్న విజయాన్ని అందుకోలేక పోయాడు. ప్రస్తుతం కళ్యాన్ కృష్ణ దర్శకత్వంలో  ‘నేల టికెట్’ సినిమాలో నటిస్తున్నాడు.  ఈ సినిమాకు సంబంధించి భారీ సెట్టింగు రామోజీ ఫిలిమ్ సిటీలో వేశారట..మిగతా షూటింగ్ ఇక్కడే జరుపుతారని వార్తలు వచ్చాయి. 
asssdfadfdddfdd
తాజాగా ఉగాది సందర్భంగా.. తెలుగు ప్రేక్షకులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘నేల టికెట్’ ఫస్ట్‌లుక్‌ను శనివారం సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రవితేజ మాంచి మాస్ లుక్‌లో.. టీ తాగుతూ అమ్మలక్కలతో కబుర్లు చెబుతున్నాడు. అలాగే, ఈ సినిమా టైటిల్‌ను కూడా భిన్నంగా ‘టికెట్’ రూపంలో ప్రజెంట్ చేశారు. దాని వెల రూ.10 గా చూపించారు. అంతేకాదు, ఆ టికెట్ నెంబరు ‘420’గా చూపించారు.
Image result for NELA TICKET
నాగార్జునతో ‘సోగ్గాడే చిన్నినాయనా’, నాగ చైతన్యతో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రాలతో హిట్ కొట్టిన కళ్యాణ్‌కృష్ణ  నేట టికెట్ తో మరో సెన్సేషన్ విజయం ఖాయమని అంటున్నాడు. ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, సుబ్బరాజు, ఆలి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి, సురేఖా వాణి, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ‘ఫిదా’ ఫేం శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: