టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లలో వరుస ఆఫర్స్ తో సందడి చేస్తున్న బ్యూటీ శృతి హాసన్. సింగిల్ సినిమాతో ఐరెన్ లెగ్ నుండి గెల్డెన్ లెగ్ అనిపించుకుంది. బడాస్టార్స్ తో జోడీ కట్టే ఛాన్స్ పట్టేసింది.  ఇదంతా గతం... కానీ ప్రజెంట్ తన పరిస్థితి రివర్స్ అయింది. సింగిల్ ఆఫర్ లేక... చిన్నాచితకా సినిమాల్లో నటించలేక సతమతమవుతోంది.

Image result for shruti hassan

శృతి హాసన్... కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఈజీగానే ఎంట్రీ ఇచ్చినా.. హిట్ మాత్రం ఈజీగా రాలేదు. మొదట్లో హీరోయిన్‌గా చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో ‘శృతి ఐరెన్ లెగ్’ అంటూ కామెంట్స్ వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ మూవీతో ఆమెకి ఫస్ట్ బ్లాక్‌ బస్టర్ హిట్ వచ్చింది. తరువాత అటు తమిళం, ఇటు తెలుగులో బిజీ హీరోయిన్‌గా మారిపోయి ఓ రెంజ్ లో హల్ చల్ చేసింది. కానీ లాస్ట్ ఇయర్ నుంచి బ్యాయ్ ప్రెండ్ తో చక్కర్లు కొడుతూ కెరీర్ ను లైట్ తీసుకుంది. దీంతో ప్రజంట్ తన కెరీర్ కి పెద్ద డ్యామేజే వచ్చింది.

Image result for shruti hassan

ఇప్పుడు తెలుగు, తమిళ్, హిందీలో ఒక్క సినిమా ఆఫర్ కూడా శృతి ఎకౌంట్ లో పడలేదు. మొన్న తమిళ్ బాహుబలిగా తెరకెక్కించాలనుకున్న ‘సంఘమిత్ర’ కూడా శృతి చేజారిపోయింది. ఐతే.. రీసెంట్‌గా శృతి ఓ కన్నడ మూవీ చేయబోతోందనే న్యూస్ వచ్చింది. తిరిగి ట్రాక్ ఎక్కుతుందనే కామెంట్ వినిపించింది. కట్ చేస్తే ఆ సినిమా చేయడం లేదంటూ క్లారిటీ ఇచ్చేసింది శృతి హసన్. అంతేకాదు.. ఇక ముందు కూడా కన్నడంలో సినిమాలు చేయనంటూ ఖచ్చితంగా చెప్పేసింది. దీంతో ఈ బ్యూటీ డ్యూటీ డల్ అయింది. కొత్త ఆఫర్స్ లేక తన కెరీర్ కళ తప్పింది.

Image result for shruti hassan

ఎలా చూసినా ప్రజంట్ శృతిహాసన్ ప్లాపుల్లో హ్యాట్రిక్ కొట్టేసింది. అది కూడా మూడు భాషల్లో.! దీంతో ఈ లేడీ ఇప్పట్లో సక్సెస్ ట్రాక్ ఎక్కడం కష్టమనే టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు తండ్రి కమల్‌తో కలిసి నటిస్తున్న త్రిభాష చిత్రం ‘శభాష్ నాయుడు’ ఎప్పుడు సెట్స్‌ పైకి వెళుతుందో తెలియని పరిస్థితి. అలా కెరీర్‌పరంగా పూర్తి డోలాయమాన పరిస్థితుల్లో శృతి చిక్కుకుందని అర్థమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: