‘రంగస్థలం’ స్థలం మూవీ చరణ్ కు కలక్షన్స్ పరంగా ఎన్ని రికార్డులు మరిన్ని అవార్డులు తెచ్చిపెడుతుందో ప్రస్తుతానికి తెలియకపోయినా చరణ్ తల్లి సురేఖను మాత్రం ఈమూవీ చాల బాధ పెట్టిందని స్వయంగా చిరంజీవి ‘రంగస్థలం’ ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఈమూవీ గొప్పతనాన్ని గురించి చిరంజీవి మాట్లాడుతూ ఈమూవీ ఫైనల్ ప్రింట్ చూసిన తరువాత తాను సురేఖ భావోద్వేగానికి లోనైన విషయాన్ని బయట పెట్టాడు. 
నా సినిమాలు గుర్తొస్తున్నాయ్
ముఖ్యంగా తన భార్య సురేఖ అయితే ఈసినిమా చూసిన తరువాత వెక్కి వెక్కి ఏడ్చిన విషయాన్ని చెపుతూ రాంచరణ్ నటన ఆమె కంటివెంట కన్నీరు పెట్టించిన సందర్భాన్ని వివరించాడు చిరంజీవి. దీనితో ఈ విషయమై ఆతరువాత తాను సుకుమార్ తో అరగంట ఫోన్ లో మాట్లాడిన విషయాలను కూడ లీక్ చేసాడు మెగా స్టార్. 
Rangasthalam Pre Release Event Set 5 Photos
మెగాస్టార్ అభిమానుల భారీగా హాజరుకావడంతో ఆర్కే బీచ్ కిక్కిరిసిపోయింది. ‘రంగస్థలం’ చిత్రంలో నటించిన నటీనటులతోపాటు సాంకేతిక నిపుణులు అందరు ఈ ఫంక్షన్ కు రావడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఇదే సందర్భంలో చిరంజీవి మాట్లాడుతూ ‘రంగస్థలం’ సినిమా రామ్ చరణ్‌కు రావడం కొంత ఈర్షగా ఉంది అంటూ తండ్రిగా మటుకు తనకు ఆనందాన్ని కలిగిస్తోంది అంటూ ఈమూవీని ఆకాశంలోకి ఎత్తేశాడు.  
Rangasthalam Pre Release Event Set 5 Photos
వాస్తవానికి ‘రంగస్థలం’ కథ చెప్పినప్పుడు సుకుమార్ ఈసినిమాను సరిగ్గా తీయగలడా అని తాను పడిన భయాలను కూడ బయట పెట్టి సుకుమార్ కు ఊహించని షాక్ ఇచ్చాడు చిరంజీవి. ఇదే సందర్భంలో ఈమూవీ పాటలు వ్రాసిన చంద్రబోస్ తెలంగాణ బిడ్డ అయినప్పటికీ గోదావరి జిల్లాలోని పదాలు పట్టుకున్న తీరు ఆయన ప్రతిభకు నిదర్శనం అంటూ ఈమూవీ కోసం గొప్ప పాటలు వ్రాసిన చంద్రబోస్ కలానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని చిరంజీవి అనగానే ఆ ఫంక్షన్ కు వచ్చిన వేలాదిమంది తమ చప్పట్లతో చిరంజీవి మాటలకు బాసటగా నిలిచారు..



మరింత సమాచారం తెలుసుకోండి: