చిరంజీవికి ‘ఖైదీ’ సినిమాలా రామ్ చరణ్ కు ‘రంగస్థలం’ ఒక కెరియర్ టర్నింగ్ పాయింట్ అవుతుంది అని అంచనాలు ఉన్న నేపధ్యంలో చరణ్ ఈమూవీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో అన్న మాటలు నాగచైతన్యకు షాక్ ఇస్తున్నట్లు టాక్. సమంత ది బెస్ట్ అంటూ ఎందరో ప్రముఖ హీరోలు దర్శకులు ఆమెను ఇప్పటికే అనేక ప్రశంసలతో ముంచెత్తి వేసారు.
మెగాఫ్యాన్స్‌తో ఉగాది రోజున
అయితే వస్తున్న ప్రశంసలకు పొంగి పోకుండా ఆమె తాను నటించే సినిమా షూటింగ్ లో వ్యవహరించే తీరు అదేవిధంగా తాను నటించే పాత్ర కోసం ఆమె పడే కష్టం ఆమె అంకిత భావాన్ని సూచిస్తుంది. అందువల్లనే ఇప్పటికీ చాలామంది టాప్ హీరోలు సమంత తమ పక్కన నటిస్తే తమ పాత్రకు మంచి సపోర్ట్ దొరుకుతుందని భావిస్తూ ఉంటారు. 
Rangasthalam Pre-Release Function Photos Set 3

ఇప్పుడు ఇదే అభిప్రాయాన్ని చరణ్ నిన్న ‘రంగస్థలం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వ్యక్తపరిచిన మాటలలోని అతిసయోక్తిని చూసి ఆ ఫంక్షన్ కు వచ్చిన చాలామంది షాక్ అయినట్లు తెలుస్తోంది. "ఈ పదేళ్లలో ఎన్నో సినిమాలు చేశాను. కానీ ఈ సినిమాలో మాత్రం సమంతతో చేసినప్పుడు చాలా ఎనర్జీ వచ్చింది. మనపై మనకు ఓ నమ్మకం కలిగిస్తుంది సమంత. ఓ మంచి కో-స్టార్ దొరికితే ఏ నటుడికైనా బాగా నటించడానికి అవకాశం దొరుకుతుంది. రంగస్థలంలో ప్రతి సీన్ ఇంత అందంగా రావడానికి సమంత కూడా కారణం."అంటూ చరణ్ సమంతను ఆకాశానికి ఎత్తేశాడు.
Rangasthalam Pre-Release Function Photos Set 3
ఇంతవరకు రామ్ చరణ్ మాటలు బాగానే ఉన్నా ఇక్కడ చరణ్ అన్న మాటలు కొత్త సంచలనాలకు శ్రీకారం చుట్టాయి. తన స్టేట్ మెంట్ ను కాంట్రవర్సీగా తీసుకోవద్దు అంటూ జీవితాంతం నాగచైతన్యతో సమంత ఎలాగైతే నిజజీవితంలో ఉంటుందో అలా తనకు కూడా జీవితాంతం సమంతతో సినిమాలు చేయాలని ఉంది అంటూ శాలన వ్యాఖ్యలు చేసాడు చరణ్. అంతేకాదు ఆమెకు 30ఏళ్లు వస్తే అలాంటి పాత్రే చేస్తాను. 40ఏళ్లు వస్తే ఆ టైపు క్యారెక్టరే చేయాలనుంది. సమంతను చూసి అంతలా ఇంప్రెస్ అయిపోయా అంటూ భావోద్వేగంగా చరణ్ మాట్లాడుతూ ఉంటే అతడి మాటలకు సమంత కూడ ఆశ్చర్యంగా చరణ్ వైపు చూడటం ఈ ఫంక్షన్ లో హైలెట్. చరణ్ మాటలను బట్టి చూస్తుంటే సమంత మరో దశాబ్దకాలం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగినా ఆశ్చర్యం లేదు అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: