సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆప్తులు చాలా తక్కువ అనే విషయం తెలిసిందే. ఇటీవలే  రాజకీయ రంగంలోకి పూర్తి స్థాయిలో అడుగుపెట్టాడు కాబట్టి ఆప్తులు పెరిగి ఉండొచ్చు అని అనుకున్నా తప్పే. ఎందుకంటే చాలా సందర్భాలలో నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు ఇంకో ఇద్దరు మాత్రమే నా కష్టకాలంలో నాకు తోడు, ధైర్యాన్ని ఇచ్చారు అని చెప్పుకొచ్చారు. అయితే ఎవరుచెప్పినా, చెప్పుకున్నా ఇండస్ట్రీలో పవన్ మరియు కమెడియన్ అలీ ది ప్రత్యేక బంధం అని చెప్పొచ్చు.


పవన్ నటించే ప్రతి సినిమాలో అలీ ఖచ్చితంగా ఏదో ఒక పాత్రలో నటిస్తుంటాడు. అయితే పవన్ చివరి చిత్రం అజ్ఞాతవాసిలో అలీ కి నటించే ఛాన్స్ రాలేదు. దీంతో మీడియా కాస్త అతిగా ప్రవర్తించి పవన్ కు అలీకి మధ్య గొడవలు వచ్చాయి అందుకే ఈ సారి పవన్, అలీని సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు అని పుకార్లు సృష్టించాయి. అయితే ఈ పుకార్లకు అలీ ఎట్టకేలకు స్పందించాడు. తాజాగా ఒక దినపత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.


ఆయన మాట్లాడుతూ - ఈ మధ్య పవన్‌కల్యాణ్‌ కు నాకు గొడవైందని పుకార్లు లేపారు. అది నిజమే మా ఇద్దరికీ గొడవైంది. కాకపోతే అది ఇవాంకా ట్రంప్ గురించే అంటూ నవ్వుతూ చెప్పారు. అయితే ఈ విషయమై ఇవాంకా గురించి మీరూ, నేను కొట్టుకున్న మాట నిజమే కదా, అని రేపు ఆయన్ని అడగబోతున్నా కూడా అని సరదాగా అన్నారు. రీసెంట్ గా జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి నన్ను పిలిచారు, వెళ్ళాను కూడా! ఇంక మా ఇద్దరి మధ్య గొడవలేముంటాయి అని ఆయన చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: